Tag: farmer

‘రుణ’మో…పణమో!

రైతు పెరిగి పారిశ్రామిక వేత్త కావటం నిన్నటి పరిణామం. కానీ పారిశ్రామిక వేత్త ముదిరి రైతు కావటం రేపటి విపరీతం. అవును. ఇది నిజం. కేంద్రంలో కానీ, రాష్ట్రాలలో కానీ అధికారం లో ఎవరు వున్నా, ఇలాంటి భవిష్యత్తుకే బాటలు వేస్తున్నారు. కానీ చిత్రమేమిటంటే, రైతును ముంచే ప్రతిచర్యనూ రైతు క్షేమం పేరు మీద చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, చికిత్స కోసం వచ్చిన రోగికి ఔషధమని చెప్పి, విషాన్నిస్తే ఎంత గొప్పగా వుంటుందో, ఈ చర్యకూడా అంత గొప్పగానే వుంటుంది. నిజం చెప్పాలంటే, ‘ఎల్‌పీజీ’ (లిబరలైజేషన్‌, ప్రయివేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌) ఆర్థిక విధానం దేశంలోకి వచ్చాక, ఏ పార్టీ సర్కారయినా, ఇదే పనిచేసింది.