పేరు : బి.ఎస్. యెడ్యూరప్ప
దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘నాజీ’ ముఖ్యమంత్రి. (అంటే మామూలు ‘మాజీ’ ముఖ్యమంత్రి అని కాదు. నియతలా శాసించే ముఖ్యమంత్రి అన్న మాట.)
ముద్దు పేర్లు : ఎ-టూ-జెడ్ యూరప్ప(కర్ణాటక లో బీజేపీ యూనిట్ వరకూ ఆది నుంచి అంతం వరకూ నేనే.)
విద్యార్హతలు : గుమస్తా పనికి సరిపోయే చదువనుకునేరు. అదే సమస్తానికి సరిపోతుంది. నా క్యాంపులో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో, లెక్కలేసుకోవటానికి ఆ మాత్రం చదువు చాలదా?