పేరు : పి.ఎ.సంగ్మా
దరఖాస్తు చేయు ఉద్యోగం: తొలి గిరిజన రాష్ట్రపతి అభ్యర్థి( గెలవవచ్చు. గెలవక పోవచ్చు. అసలు ఒక గిరిజనుడు ఈ పదవికి నామినేషన్ వేయటంతో నే చరిత్ర సృష్టించాను. ఓటమి తప్పదని ఇలా మాట్లాడుతున్నానని అనుకోకండి.)
ముద్దు పేర్లు : ‘సంఘ'(పరివార)మా.( క్రైస్తవమతస్తుడయి వుండి కూడా హిందూత్వ సంఘపరివారం మద్దతుతో నామినేషన్ వేశాను. పదవి కోసం సెక్యులరిజాన్ని కాస్సేపు పక్కన పెట్టవచ్చు.) పీయ్యే.( ఎవరికీ పర్సనల్ అసిస్టెంట్‌ను కాను. పీయ్యే- అంటే ప్రెసిడెన్షియల్ యాస్పిరెంట్ అనగా రాష్ట్రపతి ఆశావహుణ్ణి.