Tag: Sri Sri

నిజం నాకు తెలుసు – నెపం నగ్నముని మీదకి!

ఒక జలప్రళయం ముగిశాక, సమస్త సృష్టీ సర్వనాశనమయ్యాక, నీటమునిగిన నేలతల్లి తేరుకున్నాక, ఒక వెలుగు కిరణం తొంగిచూశాక నోవహు తన ఓడనుంచి ఒక పిట్టను వదలుతాడు. ఒక పచ్చని మొక్క మొలకెత్తిన జాడను పిట్ట ముందుగా కనిపెడుతుంది. ఆ ‘వెలుతురు పిట్టే’ కవి. (ఈ మాటనిచ్చిన కవి మిత్రులు శ్రీమన్నారాయణ గారికి కృతజ్ఞతలు) అదే జలప్రళయం…

శ్రీశ్రీ: అందరి కవి! అందని రవి!

శ్రీశ్రీ ఎవరు? మహాకవి. ఈ విషయం నాకూ, మీకూ, మనందరికీ తెలియకముందే ఆయనకు తెలిసిపోయింది- తాను తారనయ్యానని ఒక నటుడికి ముందే తెలిసిపోయినట్లు. అందుకనే ‘ఈ శతాబ్దం నాది’ అని ఇరవయ్యవ శతాబ్దం మీద తన పేరు ముందుగా రాసేసుకున్నాడు. ముప్ఫయ్యవ దశకం వరకూ ఆధునిక తెలుగుకవిత్వాన్ని తాను చెయ్యిపట్టుకుని నడిపిస్తే, ఆ తర్వాత దాన్ని…