‘ఎగస్ట్రా’లిన్‌!

stalin mk_stalin_illus_20120326పేరు : ముతువేల్‌ కరుణానిధి స్టాలిన్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: మధ్యంతర ముఖ్యమంత్రి( ఎఐఎడిఎంకె ప్రభుత్వం మధ్యలో కూలి పోతే ముఖ్యమంత్రి మనకే వస్తుంది కదా!)

ముద్దు పేర్లు : ‘ఎక్‌స్ట్రా’లిన్‌( ఇతరుల చేసే ఏ పనిలోనయినా నా కంటూ కొంచెం ఎక్‌స్ట్రా వుంటుంది. నా సోదరుడు అళగిరి చేసిన దానికన్నా ఎంతో కొంత అదనంగా చేశాను కాబట్టే నాన్నగారు, నాకు రాజకీయ వారసత్వం ఇచ్చారు. పళని బలపరీక్షలో కూడా అందరి చొక్కాలు కొంచెం చినిగితే నా చొక్కా కొంచెం ‘ఎక్‌స్ట్రా’ చినిగింది. గమనించే వుంటారు.)

విద్యార్హతలు : చరిత్ర. చదివిందీ అదే. సృష్టించేదీ అదే. (తమిళ రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పుదామనుకుంది. పడనిస్తామా? ద్రావిడ చరిత్రే వుండాలి. కొట్టుకుంటే రెండు ద్రావిడ పార్టీలే కొట్టుకోవాలి. మధ్యలో ఉత్తరాది పార్టీలను దూర నివ్వం.)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: హింస సృష్టించయినా అహింసను గెలిపిస్తాం. అహింస మీద మాకున్న కమిట్‌మెంట్‌ అలాంటిది.

రెండు: అతి చేసే ప్రతి పక్షం అని పలుసార్లు నిరూపిస్తుంటాను.

సిధ్ధాంతం : మనకు నచ్చిన శత్రువును మనం ఎంచుకోవాలి. (పన్నీర్‌ సెల్వం లాంటి బలహీనశత్రువుకన్నా, పళని లాంటి అనుకూల శత్రువు మెరుగు. అందుకే ఆయన్ని బల పరీక్ష ద్వారా కాకుండా ‘భుజ బల పరీక్ష’ ద్వారా గెలవటానికి సహకరించాం. అంకెలు కూడా సరిపోయేలా వాకౌట్‌కూడా

వృత్తి : నవ్వటం.( నేను నవ్వాననే పాపం పన్నీర్‌ సెల్వం కూడా నవ్వారు. అదే శశికళకు నచ్చలేదు. తక్షణం ఆయన్ని ముఖ్యమంత్రి నుంచి తొలగించేశారు.)

హాబీలు :1.నాన్న చెప్పినది చేసి నాన్న మెప్పు పొందటం.

2. నాన్న ‘చెప్పనిది’ కూడా చేసి, నాన్న మెప్పు పొందటం.( అసెంబ్లీలో రగడ అలాంటిదే)

అనుభవం : అనుభవం ఎక్కువే. అంతకు మించిన అనుభవం వున్న నాన్న గారు పక్కన వుండటం వల్ల యువకుడిలాగానే కనిపిస్తాను.

మిత్రులు: శత్రువుకి శత్రువులు. ( బీజేపీకి శత్రువులు)

శత్రువులు : ఇక్కడ మాత్రం సాటి ద్రావిడ పార్టీనే శత్రుపక్షంగా గుర్తిస్తాం.

వేదాంతం :చెలరేగిపోతే పోయేదేమీ లేదు చొక్కాలు చినగటం తప్ప

జీవిత ధ్యేయం :ఆజన్మాంత తమిళ ముఖ్యమంత్రి

సర్‌

 

1 comment for “‘ఎగస్ట్రా’లిన్‌!

  1. Venkat Kolluru
    February 26, 2017 at 7:02 pm

    Excellent Sir

Leave a Reply