‘వాట్ శిష్యా!’
‘అద్వానీ గారి ఉపన్యాసానికి వాస్తు దోషమేమన్నా వుందా గురూజీ?’
‘ఎందుకా అనుమానం శిష్యా?’
‘పాకిస్తాన్ వెళ్ళినప్పుడు జిన్నాను దేశభక్తుడన్నారు. ఇండియాకొచ్చాక మాట మార్చారు గురూజీ.’
‘అది పాత సంగతిలే శిష్యా.’
‘అవినీతి మీద దేశమంతటా తిరుగుతూ ధ్వజమెత్తారా..!’
‘కర్ణాటకలో గాలినీ, యెడ్యూరప్పనూ వదిలేశారంటావ్!?’
‘కాదు. కర్ణాటకనే వదిలేశారు గురూజీ! ఆయన రథం కర్ణాటక మీదుగా పోనివ్వలేదు!’
‘అవును. నిజమే శిష్యా.’
‘హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం తాము రెడీ అన్నారా? కానీ, యుపీని నాలుగు ముక్కలు చేయాలంటే.. తొందర పడకూడదంటున్నారు. ఇప్పుడు చెప్పండి. స్థలాన్ని బట్టి ఆయన మాట మారిపోతుంది. ఇది వాస్తు దోషం కాదంటారా?’
‘నాకు తెలియుదు శిష్యా…!’
– సతీష్ చందర్