(పిచ్చి కోరిక ఏదయినా సరే చచ్చేటంత భయపెడుతుంది. ఉత్తినే, కంటికి ఇంపుగా కనిపించే అమ్మాయి నీ పక్కన వుంటే బాగుంటుంది- అని అనిపించిందనుకో. గుండె అదురుతుంది. కాళ్ళు వణుకుతాయి. దు:ఖమే దు:ఖం. ఉత్తినే కాకుండా, నిజంగా అనుకుని చూడు. లేని తెగింపు వస్తుంది. ఆమె కోసం, ఏడు సముద్రాలు ఈదాలనిపిస్తుంది. అంతా అనుకోవటంలోనే వుంటుంది.)
అనుకోవటంలోనేఅంతా వుంది.
నింగికి ఎగరనూ వచ్చు
కడలిని మధించనూ వచ్చు.
నూరు బెంగలతో
బయిలుదేరినవాడు
గుమ్మం దగ్గరే
చతికిల పడతాడు.
చెయ్యెత్తు మనిషిని
మరగుజ్జుగా
మార్చగలిగేది
ఒక్క భయమే!
-సతీష్ చందర్
(ప్రజ దినపత్రికలో 30 డిసెంబరు 2007 నాడు ప్రచురితం)
Its Real Sir Chaala bagundi/