ఎడతెగని కలలు

పువ్వు కోసమే చెయ్యి చాపేది. కానీ ముల్లు గుచ్చుకుంటుంది. హఠాత్తుగా నిద్రలేచి కిటికీలోంచి చూస్తే.. నింగిలో ఎర్రని నారింజ. ఉదయమే అనుకుంటాం. కాని అది సాయింత్రం. రేపటి కోసమనే.. ఒక తుపాకీ తోనో, పెట్రోలు డబ్బాతోనో బయిలు దేరతాం.. ఆగి చూసుకుంటే నిన్నలో వుంటాం. అడుగులే కదా, అని వేసేయకూడదు. ముందుకో, వెనక్కో ..తెలుసుకోవద్దూ. లేకుంటే ఖరీదయిన త్యాగం కాస్తా, సాదాసీదా మరణమయిపోతుంది.

photo john thompson imagery

పొద్దు పొడవని

పగలూ

బిడ్డరాని

రాత్రీ

ఆమె ఎరుగదు.

కొన్ని వందల

పగళ్ళూ, రాత్రిళ్ళూ

కళ్ళల్లో ఎన్ని వత్తులో..

ఒక నినాదం వెంటో, ఒక పతాకం తోనో..

ఎటు వెళ్ళాడో..

ఎదురు చూపులంటేనే

ఎడతెగని పీడకలలు.

-సతీష్‌ చందర్‌
(ఆంధ్ర్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

2 comments for “ఎడతెగని కలలు

Leave a Reply