ఏమవుతారు?

(విడివిడిగా వుంటే చుక్కలే.కలిపితేనే కదా ముగ్గు? చెల్లాచెదురుగా వుంటే ఉత్త పదాలే?కలిపితేనే కదా వాక్యం? ఎడమ ఎడమగా వుంటే ఏకాకులమే. కలివిడిగా వుంటేనే కదా సమూహం? అందమయినా,ఆనందమయినా వుండేది కలయకలోనే. నన్నునిన్నుతో హెచ్చవేస్తేనే కదా- అనుబంధమయినా, పెనుబంధమయినా…)

hug (photo by Fragile JW)

రాతికి-
రాయికి ఏమవుతుందో
రాపిడి చేస్తే తెలుస్తుంది
మహా దావానలమే!

నీటికి-
నీరు ఏమవుతుందో
కలిపి చూస్తే తెలుస్తుంది
మహా ప్రళయమే!

మనిషికి
మనిషి..!?
వేర్వేరుగా విసిరేసి చూడండి
ఒక గాఢాలింగనమే
-సతీష్‌ చందర్‌
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

1 comment for “ఏమవుతారు?

  1. నన్నునిన్నుతో హెచ్చవేస్తేనే కదా- అనుబంధమయినా, పెనుబంధమయినా…)!

    aa line saripotundi sir!,………………yemavutaaro?

Leave a Reply