నిద్దురే నిజం!

(అవును. నాకు నేనే దొరకను. నాలాగా వున్ననేనుతో నాకు పనివుండదు. ఉత్తినే వానలో తడవాలనీ, 

ఇసుకలో ఆడాలనీ, దొంగచాటుగా చెట్టునుంచి పచ్చి మామిడికాయ కొట్టుకొచ్చి, పచ్చికారం, ఉప్పూ కలుపుకుని
తినాలనీ ఉంటుందా? సరిగా అప్పడే, మెక్ డొనాల్డ్స్ల్ లో దూరి బర్గర్ తిని, నేను కాని నేనుగా తిరిగి వస్తా. ఎవర్నయినా
గాఢంగా కౌగలించుకోవాలని, కేవలం కరచాలనంతో తిరిగి వచ్చినప్పడు, నా ముఖం నాకే నచ్చదు. మీకేం చూపను? )

ఊయల్లాంటి పడవా,

ఊపే నదీ,

పిట్టల జోలా-

చాలవూ ..

నిద్దుర వంకతో

నిజమైన మెలకువలోకి వెళ్ళటానికి!?

నేనెప్పుడో కానీ దొరకను.

నీక్కావలసింది నా వంటి నేను కదా!

అందుకే మరి..

నన్ను కలలోనికి వెళ్ళ నివ్వు.

నన్ను నన్నుగా రానివ్వు.

మనం అవసరాలతో కాకుండా,

ఆప్యాయతలతో మాట్లాడుకునేది

కేవలం స్వప్నంలోనే కదా!!

-సతీష్ చందర్

 

5 comments for “నిద్దురే నిజం!

  1. మనం అవసరాలతో కాకుండా,

    ఆప్యాయతలతో మాట్లాడుకునేది/

    కేవలం స్వప్నంలోనే కదా!/బాగుంది సార్౧

Leave a Reply