బషీర్ ‘బాబ్’

caricature: Sekhar

మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర, లేక పోతే పరిహారం, అదీ కాకపోతే రుణాలు మాఫీ.. చేస్తాం.
-నారా చంద్రబాబు నాయుడు, టిడిపి అధ్యక్షుడు
అది కుదరక పోతే … బషీర్ బాగ్ చేస్తారు.( మీరు అధికారంలో వుండగా రైతుల్ని కాల్చిన చోటు అదే కదా!)

విభజనకే మేం వ్యతిరేకం. విభజన వాదులకు కాదు
– పరకాల ప్రభాకర్, విశాలాంధ్ర మహాసభ ప్రతినిథి
తెలంగాణ వాదులు కూడా అంతే. భజనకే వారు వ్యతిరేకులు. భజనవాదులకు కాదు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన నాయకులు నేడు జైళ్ళలో వున్నారు
-డాక్టర్ లక్ష్మణ్, బిజెపి జాతీయ కార్యదర్శి
వారి పై ఎంత జాలి? అందుకేనా మీ పార్టీ నుంచి యెడ్యూరప్పను తోడుగా పంపారు?

తెలంగాణ కోసం 1969లో పెద్ద ఉద్యమం జరిగింది. ఆ సమయంలో తెలంగాణ ఇచ్చే శక్తి వున్నా ఇందిరాగాంధీ ఇవ్వలేదు.
-ఎం. సత్యనారాయణరావు, ఆర్టీసీ ఛైర్మన్
ఓ పదేళ్ళ తర్వాత 2011లో పెద్ద ఉద్యమం జరిగింది.. అప్పడు సోనియా గాంధీకి శక్తి వుంది కానీ…. ఇలాగే చెబుతారేమో కదా…?

జగన్ వర్గం ఎమ్మెల్యేలు సోనియాకు క్షమాపణ చెప్పాకనే తిరిగి కాంగ్రెస్ లోకి రావాలి
-మధు యాష్కి, కాంగ్రెస్ ఎం.పి
కావాలంటే సోనియాను ఓదారుస్తారు. క్షమాపణ చెప్పలేరు. జగన్ దగ్గర వారు నేర్చుకున్నది కేవలం…ఓదార్పు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *