బెంగ

photo by foxkiyo

(ఎవరూ లేరే..అని అనుకుంటాం అప్పుడప్పుడూ. నాకు నేనూ, మీకూ మీరూ క్షణంలో హాజరు. అవును కదా! నాతో నేను మాట్లాడి ఎన్నాళ్ళయింది? దేని గురించి మాట్లాడను- అని అనుకుంటాను ముఖం కడుక్కోవటానికి టాప్‌ విప్పుతూ…! నీళ్ళు.. చేతుల్ని తడిమేస్తూ. జల స్పర్శ! ఏదో గుర్తు. చిన్నప్పటి జ్ఞాపకం. అందరూ ఆడుతూనే వున్నారు. నా ముంజేతి మీద పెద్ద చినుకు. వాన పిల్ల పెట్టిన తొలిముద్దు. వాళ్ళకింకా తెలీదు- కాస్సేపేట్లో మేం ‘వానా, వానా వల్లప్పా ఆడబోతున్నామని…!’ నీరు గుర్తొస్తే చాలు, నాలోకి నేను వెళ్తూ, మీలోకి మిమ్మల్ని పంపిస్తాను. నా బెంగను మీ బెంగగా చేసేస్తున్నాను. మన్నించండి.)

రాతికి

రాయి ఏమవుతుందో

రాపిడి చేస్తే తెలుస్తుంది

మహా దావానలమే!

నీటికి

నీరు ఏమవుతుందో

కలిపి చూస్తే తెలుస్తుంది

మహా ప్రళయమే

మనిషికి

మనిషి..!?

వేర్వేరుగా విసిరేసి చూడండి

ఒక గాఢాలింగనమే.

– సతీష్‌ చందర్‌
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

1 comment for “బెంగ

  1. okappudu.. maa lecturer prodbalamtho.. kavithalu rasedanni… konni varapatrikallo kuda vachchai.. taravata.. bratuku teruvu parugu pandemlo.. busy ai poyanu.. sahityaniki poorthi ga dooram aianu.. ekkadyana kavitalu kanipinchinappudu chadavalante bore kodutondi.. kani mee kavitalu vyasalu aasakthiga untunnai.. malli kavithala patla istam kalugutondi.. ante …. rayalanipinchatam ledu kani chadavalani anipistondi..mee sahityanni…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *