జీవితానికి ముసుగు తత్త్వవేత్తకూ నచ్చదు. కవికీ నచ్చదు.తత్త్వవేత్త మొత్తం ఆ ముసుగు తీసి వేస్తాడు.కవి కూడా అదే పని చేస్తాడు. కానీ భావుకతతో మేలి ముసుగు వేస్తాడు.పొద్దున్నే పొడుచుకొచ్చే సూర్యుడి కి మబ్బులు అడ్డొస్తే ఊరుకోడు. కానీ,తాను మాత్రం పల్చని మంచుతెర మాటునుంచి చూస్తానంటాడు.సౌందర్యం గొప్పది కదా..
నిదురించిలేవటానికీ-
మరణించి
లేవటానికీ-
పెద్ద తేడా లేదు.
స్వప్నం చెరగటమో,
ప్రాణం విడవటమో తప్ప!
-సతీష్ చందర్
(ఆంధ్రప్రభ ధినపత్రికలో ప్రచురితం)
మరణం నిద్రగా, జీవితం మెలకువలో ఉన్న దిశగా…బావుంది మీ ముద్రతొ…వాసుదేవ్
చాలా బాగుంది సార్…
గురువు గారు ..
ఇంకా మీ జ్ఞాపకాల తోటల్లో
నేను విహరిస్తూనే ఉన్నా
ఎవరు రాస్తారండి ..
అందంగా కనిపిస్తే చాలు
కాటేసే కళ్ళు
వెంటాడి వేధించే చూపులు
అలాంటి లోకంలో …
మీరు సిల్క్ స్మిత మీద రాసిన ఎలిజీ
ఇంకా నా గుండెను చీల్చుతూనే ఉంది..
( తడి ఆరని సంతకం .. సతీష్ చందర్ కలం )
http://hrudayaganam.blogspot.com
హృదయం మోగడమో / ఆగడమో కదా
ప్రాణ దేహాన్ని / పార్ధివ శరీరం చేసేది..గ్రేట్ గా చెప్తారు మీరు