Month: December 2012

‘వరుడా!’ ఏమి నీ కోరిక?

అవునూ, కాదూ- మధ్యకూడా అనేక సమాధానాలుంటాయి.

అనుమానం వుంటే, ఒక్క సారి ‘అఖిల పక్షం’ పెట్టి చూడవచ్చు.

రాజకీయం మొత్తం- ఈ రెండూ కాకుండా, రెంటికి మధ్యే ఇరుక్కుని వుంటుందని తేలిపోయింది.

తెలంగాణా కావాలా? అంటే, అవునూ అని చెప్పిందెవరూ?

ప్రశ్న అడిగిన పెద్దమనిషినే- ‘మా సంగతి సరే, మరి నువ్వేమంటావ్‌?’ అని పీక పట్టుకున్నారు.

‘అ…అ…అవుదు’ అని కాస్సేపూ, ‘కా… కా…కావును’ అని కాస్సేపూ అని అన్నారు.

లైంగికోగ్రవాదులు!

అత్యాచారాలు జరిగినప్పుడెల్లా అల్లర్లు జరగవు

అల్లర్లూ, ఆందోళనలు జరిగినప్పుడు- అందరూ బెంగపడిపోతారు. సర్కారూ, పోలీసులూ మాత్రం భంగపడిపోతాయి.

ఈ బెంగపడ్డ వారిలో పెద్దలూ, పిన్నలూ, ఆడవాళ్ళూ, మగవాళ్ళూ అందరూ వుంటారు. ఇలా మళ్ళీ మళ్ళీ జరగకుండా వుండటానికి ఏమి చెయ్యాలీ- అన్నప్పుడు ఎవరికి తోచిన సలహాలూ, సూచనలూ వారిస్తారు. ఢిల్లీ బస్సులో కిరాతకంగా జరిగిన అత్యాచారం తర్వాత ఈ సూచనలకు మరింత విలువ పెరిగింది. ఈ సూచనల్ని సూక్ష్మీకరిస్తే రెండు రకాలు తేలతాయి:నివారణ, చర్య.

కలహం బహిర్గతం! కాపురం అంతర్గతం!!

తెలిసింది, తెలియనట్లూ

తేల్చేసింది తేల్చనట్లూ

నాన్చేసింది నాన్చనట్లూ

చెప్పటాన్ని ఏమంటారో తెలుసా? మేధోమథనం.

అన్ని పార్టీల్లోనూ కుమ్ములాటలుంటాయి.కాస్త మర్యాదగా చెప్పాలంటే అంత:కలహాలుంటాయి. ఎక్కువ మర్యాదగా చెప్పాలంటే అంతర్గత ప్రజాస్వామ్యం వుంటుంది.

‘రోబో’ కాంత్‌

పేరు :రజనీ కాంత్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: స్టారాధిస్టారుడు.

ముద్దు పేర్లు : వాజీ. శివాజీ. శివాజీరావు గైక్వాడ్‌ ( అసలు పేరు ఇప్పటికీ ముద్దుగానే వుంటుంది.)

విద్యార్హతలు : బీ.ఎస్‌.సి . అంటే తెలుసా? (బ్యాచిలర్‌ ఆఫ్‌ స్వింగింగ్‌ సిగార్‌) చేతిలో సిగార్‌ను(సిగరెట్టును) విసిరితే అది రెండు పల్టీలు కొట్టి నోట్లో పడుతుంది.(నాలా చాలా మంది ప్రయత్నం చేసి మూతులు కాల్చుకున్నారు.బ్రహ్మానందం లాంటి ‘పొట్టి రాయుడు’ పక్కవాళ్ళ మూతుల్ని కాలుస్తారు.)

‘గుజ’ బలుడు మోడీ

ఓడలు బళ్ళవుతాయి: అద్వానీలు మోడీలవుతారు.

బళ్ళు ఓడలవుతాయి: మోడీలు అద్వానీలవుతారు.

అలనాడు అద్వానీకి అనుంగు శిష్యుడు మోడీ. కానీ ఇప్పుడు, అదే అద్వానీ ‘న.మో’ అంటున్నారు.

రేపో, మాపో, అద్వానీ తాను వెనక్కి తగ్గి పోయి- ప్రధానివి నువ్వే- అని మోడీతోఅన్నా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే పోటీలో వున్న వాళ్ళంతా ఇలాంటి ఆశీస్సులే ఇచ్చేస్తున్నారు.

రాష్ట్ర విభజన కాదు, పార్టీల విభజనే!

అదే సీన్‌: అఖిల పక్షం: షూటింగ్‌ స్పాట్‌: ఢిల్లీ. తేదీ: 28 డిశంబరు 2012

సినిమాటోగ్రాఫర్‌: సుశీల్‌ కుమార్‌ షిండే.

కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సోనియా గాంధీ

ఒక్కో పార్టీకి ఒక్క పాత్రే వుంటుంది. కానీ ఇద్దరేసి పోషించాలి. అదికూడా ఒకరి తర్వాత ఒకరు కాదు. సమాంతరంగా ఒకే సమయంలో పోషించాలి. ఒకరు ‘అవునూ’ అంటూంటే, ఒకరు ‘కాదూ’ అనాలి.

తెలుగు వాడి ‘పంచె’ తంత్రం!

సోనియా గాంధీ మాతృభాషలో మాట్లాడటం ఎవరయినా విన్నారా? అచ్చం మన తెలుగులాగానే వుంటుంది. అనుమానమా? తెలుగును ఇటలీ భాషతో పోల్చలేదూ..? (ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌- అన్నారా? లేదా?). రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఈ ముక్క తట్టినట్టు లేదు. లేకుంటే ప్రపంచ తెలుగు మహాసభలకు సోనియా గాంధీని పిలిచేవారు.

ఇంతకీ ఇటలీ భాషతో ఎందుకు పోల్చారో? ఏ పాత్రికేయుడయినా ఈ ప్రశ్నను తిరుపతిలో ఈ సభల నిర్వహిస్తున్న వారిని ఎవర్నయినా అడిగితే ఏం చెబుతారా?

‘హిందీ’త్వ మోడీ

పేరు : నరేంద్ర మోడీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: భారతీయ(జనతా) ప్రధాని

ముద్దు పేర్లు : మూడీ(వోటర్ల మూడ్స్‌ మారుస్తానని) త్రీడీ( మూడు సార్లు గెలవటమే కాదు, త్రీడీలోప్రచారం చేశానని), కేఢీ(అపార్థం చేసుకోకండి. ‘కే’ అంటే కేశూభాయ్‌ పటేల్‌, గుజరాత్‌లో రాజకీయ భీష్ముడు. ఆయన్నే ఎదుర్కొన్నాను.)

విద్యార్హతలు : బి.పి.ఎల్‌( అంటే ఐపిల్‌ అనుకునేరు. కానీ కాదు. బ్యాచిలర్‌ ఆఫ్‌ పోల్‌ మేనేజ్‌మెంట్‌. వోట్లు ఎలా వేయించుకోవాలో తెలిపే శాస్త్రం.) రాజనీతి శాస్త్రంలో నేను చేసిన మాస్టర్స్‌ డిగ్రీ కంటె ఇది పెద్దది.

వాళ్ళు చేతులతో నడుస్తారు!

‘రావద్దు ఆలస్యంగా.

పోవద్దు ఒంటరిగా.’

‘ఎందుకనీ..?’

‘బయిట మనుషులు తిరగుతున్నారు.’

‘ఎంత మంది వుంటారేమిటి..?’

‘మన జనాభాలో సగానికి పైగా.’

‘వారిలో అందరూ ప్రమాదకరమేనా?’

‘కాదు. కొందరే.’

‘గుర్తుపట్టటమెలా?’

‘వాళ్ళ చేతులుండవు.’

‘అంగ వికలురా?’

‘కాదు.వాళ్ళకి నాలుగూ కాళ్ళే.’

‘ఏక్‌’ నారాయణ్‌!

పేరు :జయప్రకాష్‌ నారాయణ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం : తెలుగు ‘లోక్‌’ నాయక్‌ (నా పార్టీ ‘లోక్‌ సత్తా’లోనే ‘లోక్‌’ వుంది. ‘లోక్‌’ పాల్‌ను సమర్థించాను. ఇప్పుడు ‘లోకా’యుక్త కోసం ఉద్యమిస్తాను. కానీ నా ప్రయత్నాలను ప్రతీసారీ మీడియా గుర్తిస్తున్నట్లుగా ‘లోకం’ గుర్తించటం లేదు.)

ముద్దుపేర్లు :ఆంధ్రప్రదేశ్‌లో ‘జెపి’. మిగతా రాష్ట్రాల్లో జూనియర్‌ జెపి.(అక్కడ జయప్రకాశ్‌ నారాయణ్‌ అంటే, యమర్జన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన సీనియిర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ గుర్తుకొస్తారు.

‘చేతి’కి ఎముక లేదు!

పిలిచి పదవులిస్తానన్నా పారిపోతున్నారు ఎమ్మెల్యేలూ, ఎంపీలు. ఇదెక్కడి విడ్డూరం- అంటూ విస్తుపోతున్నది రాష్ట్రంలో కాంగ్రెస్‌.

ఇవ్వాలనుకుంటే, నామినేటెడ్‌ పదవులు చాలా వున్నాయి. మంత్రి వర్గంలో కూడా మరికొన్ని బెర్తుల్ని సృష్టించ వచ్చు. ఇన్ని తాయిలాలు వున్నా, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిథులు, సీమాంధ్రలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపూ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వైపూ పరుగులు తీస్తున్నారు.

‘బతికుంటే బలిసాకు తినొచ్చు’ అన్న చందంగా, ‘మళ్ళీ ఎన్నికయితే మాజీ కాకుండా బతకొచ్చు’ అనుకుంటూ దూకేస్తున్నారు.

ఈ కథలు ‘పెద్దల’కు మాత్రమే!

బధ్ధకించవచ్చు, మరచి పోవచ్చు-

దగ్గర బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళక పోవచ్చు. ఎడమ కాలి చీలమండ కింద ఎయిర్‌ ఫ్రాక్చర్‌ అయిందనో, కుడి వైపున జ్ఞానదంతం నొప్పిపెట్టి దంత వైద్యుడి దగ్గర కువెళ్ళితే, అతడి అజ్ఞానం కొద్దీ దాని పక్క పన్ను పీకినంత పనిచేశాడనో చెప్పవచ్చు.( చెప్పే కథల్లో డీటైల్స్‌ ఎక్కువ వుంటే తొందరగా నమ్ముతారు లెండి.)

కానీ ఎవరయినా తన పెళ్ళికి తాను హాజరు కావటం బధ్ధకిస్తే , పోనీ మరచి పోతే ఏమవుతుంది?

పైన పులి-లోన చెలి

ఊపిరి లాంటిదే ఊహ కూడా.

ఊపిరితో బతికేది ఒక్క బతుకే. కానీ ఊహతో వెయ్యిన్కొక్క బతుకులు బతకొచ్చు.

‘ఓ అందాల రాకుమారుడు గుర్రమెక్కాడు.’ అని కథ మొదలు కాగానే, పాఠకుడు రాకుమారుడయి పోతాడు. కొండలు, వాగులు దాటుతుంటాడు.

‘ ఓడ మునగటంతో ఓ కుర్రవాడు వచ్చి లైఫ్‌ బోట్‌లో పడతాడు’ అనగానే ఆ విపత్తు పాఠకుడికి వచ్చి పడుతుంది.

‘వోటు’ బ్యాంకుల్లో డిపాజిట్లు గల్లంతు!

బ్యాంకుల్ని ప్రయివేటు పరం చేసినట్లే, వోటు బ్యాంకుల్ని పార్టీల పరం చేస్తుంటారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క బ్యాంకులో వోట్లను డిపాజిట్టు చేసుకుంటూ వుంటుంది.

ఇందిరాగాంధీ రోజుల్లో ఎస్సీ, ఎస్టీల వోటు బ్యాంకులో కాంగ్రెస్‌కు పెద్ద యెత్తున నిల్వలు వుండేవి. అయితే రాను రాను, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ ‘టేకోవర్‌’ చేస్తూవుంది.

బాబూ! ‘సైకిలు’ దిగుతారా?

అడుగులు ముందుకీ.., నడక వెనక్కీ…!

ఆశ్చర్యమే. బాధాకరమే.

కానీ, చేయగలిగిందేమీ లేదు.

తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవటానికి చేపట్టిన చంద్రబాబు పాదయాత్ర ఇలాగే వుంది. ఇది, అక్కసుతోనో, ఉక్రోశంతోనో ప్రత్యర్థులు చేస్తున్న వ్యాఖ్యకాదు.అలాగని, శత్రువర్గ మాధ్యమాలు తన మీద అకారణంగా కక్కుతున్న విషమూ కాదు.

పాదయాత్రల ఫలితాలు అలా వున్నాయి.