Month: August 2013

‘అగ్గీ’ రాజా!

అగ్గీ పేరు : దిగ్విజయ్‌ సింగ్‌

ముద్దు పేర్లు : ‘అగ్గీ’రాజా( విభజన ప్రకటన కారణంగా రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య రగులుతున్న అగ్గిని చూస్తున్నారు కదా!) ‘విడాకుల’కింగ్‌( నేను మా పార్టీ తరపున ఏ రాష్ట్రానికి ఇన్‌ చార్జ్‌గా వుంటే, ఆ రాష్ట్ర విభజనకు తోడ్పడుతూ వుంటాను.)

‘తూచ్‌..! నేనొప్పుకోను!!’

‘నేను ప్రేమించేది నిన్ను…’ అనేసి, తర్వాత ‘కామా’ పెట్టి, రెండు నిమిషాలు ఆగి, ఊపిరి పీల్చుకుని ‘కాదు’ అని నచ్చిన అమ్మాయి ప్రకటిస్తే ఏమవుతుంది? ఒక్క ‘కామా’ చాలు పేషెంటును ‘కోమా’లోకి పంపించేయటానికి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఆమె ప్రియుడు ఆమె కోసం ప్రాణం విడవటానికి ఒక్క నిమిషం చాలు. కానీ, ఆమే… అనవసరంగా మాట తిప్పుకోవటానికి రెండు నిమిషాలు తీసుకుంది.

రాష్ట్రవిభజన విషయంలో పార్టీలు దాదాపు అలాగే మాట తిప్పాయి.

‘విభజనకు మేము అనుకూలం…’ అనేసి, తర్వాత ‘కామా’ పెట్టి, రెండు వారాలు ఆగి, ఊపిరి సలపక, ‘కాదు’ అని ప్రకటించాలని చూస్తున్నాయి.

అభద్రం కొడుకో!

‘నేను ఇక్కడ అభద్రంగానే వున్నాను. నువ్వు కూడా అభద్రంగా వుంటావని భావిస్తాను’

ఉత్తరాలు రాసినా వెళ్తాయో, లేదో, తెలియదు కానీ, ఒక వేళ తెలంగాణలో వున్నవారు, సీమాంధ్రలో వున్నవారికీ , సీమాంధ్రలో వున్న వారు తెలంగాణలో వున్నవారికీ రాయాల్సి వస్తే, ప్రారంభ వాక్యం ఇలా వుంటుంది.

ఇంతకీ అభద్రత అంటే ఏమిటో..?

‘దేశ‘మును ప్రేమించుమన్నా.. పొత్తు అన్నది ఉంచుమన్నా.!

మోడీకి నిజంగానే దేశం భక్తి తన్ను కొచ్చింది. ఇది ఒక రకం కాదు, రెండు రకాలు. ఒకటి: ‘హిందూ’ దేశభక్తి.(భారత దేశం అనే మాట కంటే, హిందూదేశమనే మటే ఆయనకు ఎంతో వినసొంపుగా వుంటుంది.) రెండవది: ‘తెలుగుదేశ’భక్తి. ఈ రెంటినీ ఏకకాలంలో ఆయన హైదరాబాద్‌లో ప్రకటించాడు.

‘క్వీని’యా!

పేరు : సోనియా గాంధీ

ముద్దు పేర్లు : ‘సోనియ’ంత, ‘క్వీని’యా,

విద్యార్హతలు : ఇటలీలో చదివిందేమయినా, ఇండియాలోనే రాజనీతి చదివాను. ‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంలో పడితే చాలు, రాజనీతి దానంతటదే వస్తుంది. రాకపోయినా వచ్చిందని జనం అనుకుంటారు. అయితే నాతో పాటు మేనకా గాంధీ కూడా ఈ కుటుంబంలోనే పడ్డారు. కానీ ఆమెకు రాజనీతి తెలుసని జనం భావించలేదు. జనం మెచ్చే ముందు అత్తిల్లు మెచ్చాలి కదా! ఇందిరమ్మ నన్ను మెచ్చారు. వారసత్వం దానంతటదే వచ్చింది.

‘ఈజీ’ నామాలా? ‘క్రేజీ’నామాలా?

రోజూ పెట్టే ‘నామా’లే, రాజీనామాలయ్యాయి. ఎవరు ఎవరికి పెడతారు? అనుమానమేముంది? నేతలు జనానికి పెడతారు.మట్లాడితే రాజీనామా! అంటే మన నేతల్లో పదవీవ్యామోహ స్థాయి అంత దారుణంగా పడిపోయిందా? కుర్చీలన్నా, అధికారాలన్నా లెక్కలేకుండా పోయిందా? ఎమ్మెల్యే, ఎంపీలే కాకుండా, మంత్రులు కూడా రాజీనామాలకు దూకేస్తున్నారు. ఇంత నిస్వార్థపరత్వం వీరికెలా వచ్చేసింది? చూసే వాళ్ళకి నిజంగానే ఆశ్చర్యంగా వుంటుంది.