(నిత్యనూతనటో ఇమంటే ఏమిప్పుడిప్పుడే అర్థమవుతోంది. దేహం మీద పాత చొక్కా తీసివేసి, కొత్త చొక్కా వేసుకోవటమే
నూతనత్వమని ఒకప్పుడు భావించే వాణ్ణి. కాని ఇప్పటి తెలివి వేరు. చొక్కాలోపలి పాత దేహాన్ని తీసివేసి, కొత్త దేహాన్ని
తొడుక్కోవటమే. మొన్న పొట్ట వున్న దేహం; నిన్న ఆరు మడతల దేహం; నేడు ఎనిమిది మడతల దేహం. నన్ను నేను
ఎప్పటికప్పుడు కొత్తగా (సిక్స్ లేదా ెయిట్) ‘ప్యాక్’ చేసుకోవాలి. ఇదే అప్ డేషన్.)

photo By: Francisco Osorio
ఈ మధ్య
నా ముఖం నాముఖంలా వుండటం లేదు.
ఎప్పటికప్పుడు ‘అప్‌డేట్’ అవుతున్నట్టుంది.
అద్దంలో చూసుకున్నప్పుడు.
అదనంగా ఓ కన్ను కనిపించింది.
‘ముక్కంటి’ ని కాబోలు అనుకున్నాను.
పరికించి చూస్తే, ‘మూడో చెవీ’,
రెండో ‘నోరూ’ వచ్చాయి.
ఇవేవిమిటీ…అంటూ వైద్యుణ్ణి
కలిస్తే కొత్త ‘యాప్స్’ అన్నాడు.
అంతే కాదు, ఇప్పుడు ‘స్మార్ట్’ ఫేస్‌గా మారిందని
కూడా చెప్పాడు
‘టచ్‘ చేస్తే కవళికలు మారిపోతాయని కూడా వివరించాడు.
అర చేతిలోకి అన్నీ వచ్చిపడిపోతున్నాయి.
ముద్దులూ, కౌగలింతలూ కూడా.
ఇంకేముంది?
ఇక నుంచి
మొబైల్ సంసారం
చేసెయ్యవచ్చు.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రికలో ప్రచురితం)
ఆధునికం అనుకొంటున్న వాటిపై..జీవన మాధుర్యాన్ని దూరం చేస్తున్న సాంకేతిక పై మంచి సెటైర్
Avasaram-unna-lekunna-technology venakala parugettute, manaku tappadu smart phone samsaralu