‘కిరణ’ం ప్రకాశించటం లేదు. రాష్ట్రంలో ఇది వార్త కాదు.
ఎందుకు ప్రకాశించటం లేదు? ఇదీ ప్రశ్న.
ఈ ప్రశ్నకు పలువురూ ఇచ్చే జవాబు వేరు. పార్టీ అధిష్ఠానం వెతుక్కుంటున్న సమాధానం వేరు.
కిరణంలో కాంతి తక్కువయిందని అందరూ అంటారు.
కానీ, పార్టీ హైకమాండ్ అలా అనదు. చుట్టూ చీకటి తక్కువయిందీ- అని అంటుంది.
అందుకే కాబోలు- ‘కిరణ్’ చుట్టూ చీకట్లు పెంచుతోంది.
కిరణ్ మంత్రి వర్గంలో ‘కళంకితుల’ శాతం పెరుగుతున్న కొద్దీ, ఆయన ఉనికి పెరుగుతుందన్నది హైకమాండ్ భావన కాబోలు. ఇంతవరకూ మిణుకు మిణుకు మని దిగులుగా మెరుస్తున్న ‘కిరణం’ ఇప్పటికయినా ప్రకాశవంతంగా కనిపించక పోతుందా-అని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు చిగురంత ఆశ కాబోలు.
Read more →