Category: Columns (కాలమ్స్)

వివిధ శీర్షికల కింద వివిధ పత్రికలలో అచ్చయిన, అచ్చవుతున్న వ్యంగ్యవ్యాస పరంపర

డెమాక్రటిక్‌ ‘డిక్టేటర్‌’!

నా పేరు : ఇమ్రాన్‌ ఖాన్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం:కెప్టెన్‌. పాకిస్తాన్‌ పొలిటికల్‌ క్రికెట్‌ టీమ్‌.(ప్రధాన మంత్రి అంటే అదే కదా! గతంలో ఇండియాతో క్రికెట్‌ ఆడాను. ఇప్పుడు రాజకీయం ఆడతాను.) వయసు : ఆరు పదులు దాటి ఆరేళ్ళు అయినా ఇంక నవయవ్వనుణ్ణే. (అయినా క్రికెటర్‌ వయసు తీసిన ‘పరుగుల’తోనూ, రాజకీయ నాయకుడి వయసు…

‘పొత్తేష్‌’ కుమార్‌!

నా పేరు : నితిష్‌ కుమార్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: మధ్యలో ఎన్నిసార్లు మానుకున్నా మళ్ళీ అదే ఉద్యోగం:బీహార్‌ ముఖ్యమంత్రి. ఒకప్పుడు ప్రధాని మంత్రికి దరఖాస్తు చెయ్యాలనుకున్నాను. ‘గుజరాత్‌ సీఎంగా వున్న మోడీ పీఎం కాగలిగినప్పుడు, నేనెందుకు కాకూడదు?’ అని అనుకున్నాను. అది మోడీ మనసులో పెట్టుకుంటే, నేను సీఎం కావటం కూడా కష్టమే..అది వేరే…

‘మెగా’శాంతి!

పేరు : విజయ శాంతి దరఖాస్తు చేయు ఉద్యోగం: రాములమ్మ-2 ( ఏం ‘బాహుబలి-2 సినిమా వస్తే చూడలేదా? తెలుగు తెర మీద వున్న ఏకైక ‘లేడీ హీరో’ని ‘సీక్వెల్‌’ రాజకీయాల్లో ఇస్తున్నా. చూడలేరా..?) వయసు : ‘ఫైట్స్‌’ చేసే వయసే. వృధ్ద హీరోలు ఎడమ చేత్తో లారీలనూ, ట్రాక్టర్లను ఎత్తేసినప్పుడు ఈ సందేహం రాదు.…

‘రుణ్‌’ జైట్లీ!

పేరు : అరుణ్‌ జైట్లీ దరఖాస్తు చేయు ఉద్యోగం: లోక్‌ సభ సభ్యుడు (2014లో పోటీ చేసి ఓడిపోయాను కదా? అయినా కేంద్ర మంత్రిని కాగలిగాను. ప్రజల వోట్లతో పనిలేకుండా రాజ్యసభకు వెళ్ళగలిగాను. దేశ ఆర్థిక గతిని మార్చేశాను. మీ జేబుల్లో నోట్ల రంగు మార్చగలిగాను. అయినా లోక్‌ సభ కు గెలిచానన్న తృప్తి నాకు…

‘శంకల’ అయ్యర్‌!

పేరు :మణి శంకర్‌ అయ్యర్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: కేంద్ర వివాదాస్పద వ్యాఖ్యల శాఖా మాత్యులు. (బీజేపీ ఎలాగూ ఇవ్వదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక, ఇలాంటి శాఖను ఏర్పాటు చెయ్యటానికి వెనకాడదు కానీ, ఆ పదవి నాకివ్వటానికి ఇష్టపడదు. ఇంకేదన్నా సర్కారు వస్తే ఇస్తుందేమో చూడాలి.) వయసు : ఏం? ఎందుకా సందేహం? వయసుకు తగ్గట్లు…

‘పక్కా’ ‘మగ’పతిరావు!

పేరు : తమ్మారెడ్డి చలపతి రావు దరఖాస్తు చేయు ఉద్యోగం: స్త్రీజనోధ్ధారకుడు (‘పక్క’లోకి మాత్రమే స్త్రీలు పనికి వస్తారని లోకానికి ఎలుగెత్తి చాటటం.) వయసు :నాది బాబాయి వయసూ… తండ్రి వయసూ… తాత వయసూ అని పరిచయం చేస్తారు కానీ..నాది మళ్ళని వయసు.( లేకుంటే కొన్ని దశాబ్దాల పాటు ఒకే ‘రేపిస్టు’ పాత్రను ఎలా చెయ్యగలుగుతాను…?)…

దిగ్వివాద సింగ్‌!

పేరు : దిగ్విజయ్‌ సింగ్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: ఎలక్షన్‌ ‘డేమే’జర్‌ ( ఎలక్షన్‌ మేనేజ్‌ మెంట్‌ అన్నది పాత మాట. ఎలక్షన్‌ ‘డేమే’జ్‌ మెంట్‌ అన్నది కొత్త బాట. గోవా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఇన్‌ చార్జ్‌గా నేను ఇదే అవలంభించాను. మన వల్ల శత్రుపక్షం ‘డేమేజ్‌’ అవ్వాలి. నిజానికి ఈ (2017) ఎన్నికల్లో…

‘ఆప్’ వింద్ ’చీపురు‘వాల్!

పేరు : అరవింద్‌ కేజ్రీవాల్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: ఏక్‌ నిరంజన్‌ ( ఢిల్లీ మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల తర్వాత ఒక్కొక్కరు పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. ఎవరు వెళ్ళిపోయినా సరే.. ఒంటరి పోరుకు సిధ్ధపడుతున్నాను.) వయసు : పోరాడే వయసు.. పాలించే వయసు కాదు. ఈ విషయాన్ని ఢిల్లీ పౌరులు ఇప్పటికి గుర్తించారు. తొలి సారి…

‘ఉత్తరు’ణ్‌ విజయ్‌!

పేరు : తరుణ్‌ విజయ్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘ఉత్తర’ భారత పౌరుడు ( భారతమంటేనే ఉత్తర భారతం. ఇదే ‘శ్వేత’ భారతం. ‘దక్షిణ’ భారతీయులు కూడా వుండవచ్చు. కానీ ఉత్తర భారతీయులకు విధేయులుగా.) వయసు : వివాదాల్లో తల దూర్చే వయసు కాదు. వివాదాలను సృష్టించే వయసు. (ఒకప్పుడు నేను ఆర్‌ ఎస్‌ ఎస్‌…

డొనాల్డ్‌ ‘జంప్‌’

పేరు : డొనాల్డ్‌ ట్రంప్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: హాఫ్‌ అమెరికన్‌ ప్రెసిడెంట్‌( అమెరికాలో సగం మంది నాకు వ్యతిరేకంగా వున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని నేను ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు ఇవ్వను.) ముద్దు పేర్లు : డొనాల్డ్‌ ‘జంప్‌’ ( ఈ చివరనుంచి ఆ చివరకు జంప్‌ చెయ్యగలను. వలస రావటానికి వీలుకాదని చెప్పిన ఏడు…

‘ఎగస్ట్రా’లిన్‌!

పేరు : ముతువేల్‌ కరుణానిధి స్టాలిన్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: మధ్యంతర ముఖ్యమంత్రి( ఎఐఎడిఎంకె ప్రభుత్వం మధ్యలో కూలి పోతే ముఖ్యమంత్రి మనకే వస్తుంది కదా!) ముద్దు పేర్లు : ‘ఎక్‌స్ట్రా’లిన్‌( ఇతరుల చేసే ఏ పనిలోనయినా నా కంటూ కొంచెం ఎక్‌స్ట్రా వుంటుంది. నా సోదరుడు అళగిరి చేసిన దానికన్నా ఎంతో కొంత అదనంగా…

‘గ్రేటే’ష్‌ బాబు!

పేరు : నారా లోకేష్‌ బాబు

దరఖాస్తు చేయు ఉద్యోగం: తెలంగాణ పౌరుడు (నాన్న ది రాయల సీమ, అమ్మది ఆంధ్ర, మరి నాకు తెలంగాణ కావాలి కదా! ఒకే కుటుంబ సభ్యులు పంచుకోవటానికి అని అనుకోకండి. పాలించటానికి. ఇప్పటికి మూడు తెలుగు రాష్ట్రాలయ్యాయి. సీమ కూడా విడిపోయి మూడు రాష్ట్రాలయినా పాలించుకోవటానికి ముగ్గురం వుండాలి కదా! అందుకని ఈ అరేంజ్‌ మెంట్‌)
ముద్దు పేర్లు: ‘షోకేస్‌’ బాబు ( నారా వారి కుటుంబం గొప్పతనానికీ, నందమూరి వారి ఖ్యాతికీ ని ప్రదర్శించటానికి ఏకైక షోకేస్‌ను నేనే.) ‘హెరిటైజ్‌’ బాబు ( ‘పాలు’టిక్స్‌ లోనూ, పాలిటిక్స్‌లోనూ నాన్నకు నేనే కదా- ఏకైక వారసుణ్ణి.)

‘కత్తుల’ రత్తయ్య!

పేరు : పందాల రాయుడు

దరఖాస్తు చేయు ఉద్యోగం: పుంజుల్ని పెంచటం. (పెట్టల పెంపకంలో అనుభవం లేదు.)

ముద్దు పేర్లు : ‘కత్తుల’ రత్తయ్య.( అపార్థం చేసుకోకండి. అసలే నేను అహింసా వాదిని. కత్తి నేను పట్టను. నా కోడికి కడతాను) . ‘కాలు దువ్వే’ కనకయ్య.( అదుగో మళ్ళీ అపార్ధం. ఎవరిమీదకీ కాలు దువ్వను. నా కంత సీను లేదు. కత్తి కట్టి బరిలోకి వదలితే. నా కోడే దువ్వుతుంది.)

‘విద్యార్హతలు :మా వాళ్లందరిలో నేనే నాలుగు ఆకులు… సారీ… ‘నాలుగు ఈకలు’ ఎక్కువ చదువుకున్నాను. కాబట్టే ‘పుంజు’ను చూడగానే, ఏది ‘నెమలో’, ఏది ‘డేగో’ ఇట్టే చెప్పేయ గలుగుతాను. (అన్నీ కోళ్ళే. కానీ పందె గాళ్ళు అలా పిలవరు. ‘ఈకలు’ తేడాలు పీకి ఇలా ‘జాతుల్ని’ నిర్థారిస్తారు. ఏం? మన దేశంలో మనుషులకు కులాలున్నప్పుడు, కోళ్ళకు మాత్రం కులాలు- ఉండాలా? లేదా?

‘ఇన్నొసెంట్‌’ ఖాన్‌!?

పేరు : సల్మాన్‌ ఖాన్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘ఇన్నొసెంట్‌ మ్యాన్‌’ (‘హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నన్ను నిరపరాధిగా ప్రకటించింది. ఇకనైనా నన్ను ‘ఆలిండియా అమాయకుడు’ గా గుర్తించాలని అభ్యర్థిస్తున్నాను.

వయసు :ఐదు పదులు దాటవచ్చు. అయినా నాకు పెళ్ళీడు వచ్చిందని నేను భావించను. ఇంకా ‘డేటింగ్‌’ చేసే వయసులోనే వున్నాను. ‘హంటింగ్‌’ అంటే నేరమవుతుంది.

అమీర్‌ ఒక క్లాసు ‘పీకె’!

వేరే గ్రహం నుంచి భూమ్మీదకు దిగి, వెతుక్కుంటూ, వెతుక్కుంటూ భారత దేశం వచ్చిన ‘పీకే'(అమీర్‌ ఖాన్‌), ఈ దేశంలో తప్ప ఎక్కడయినా వుంటానంటున్నాడా? ఆ సినిమాలో అన్ని మత ఛాందసాలకూ, సమానంగా తలంటు పోసిన అమీర్‌ పట్ల, ఒక మతానికి చెందిన ఛాందసులే ‘అసహనం’ ప్రదర్శించారా? ఇంతకీ దేశం వెళ్ళాలనే ఆలోచన ఆయనకు వచ్చిందా? లేక హిందువుగానే పుట్టిన తన భార్య(కిరణ్‌)కు వచ్చిందా?

‘జగడాల’ స్వామి

పేరు : సుబ్రహ్మణ్య స్వామి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఇన్వెస్టిగేటివ్‌ పాలిటిష్యన్‌ (పరిశోధనాత్మక రాజకీయ నాయకుడు). ( ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు వున్నట్లే, ఇన్వెస్టిగేటివ్‌ పాలిటిష్యన్‌ కూడా వుంటారని మన దేశానికి పరిచయం చేసింది నేనే. నేను తవ్వి తీసిన కేసులు ఎందరో నాయకుల పీకలకు చుట్టుకున్నాయి. జయలలిత నుంచి రాజా వరకూ ఎవ్వరినీ వదల్లేదు)

‘వినోదా’నంద రెడ్డి!

పేరు : ఆనం వివేకానంద రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘దృష్టి మళ్ళించు వాడు’ (ఇలాంటి ఉద్యోగం రాజకీయాల్లో కూడా వుంటుందని చాలా మందికి తెలియదు. రాష్ట్రమంతా రైతుల నష్టపరిహారం గురించి మాట్లాడే సమయంలో, నేనెక్కడో పబ్లిక్‌లో సిగరెట్టు తాగాననుకోండి, మీ మీడియా వాళ్లు నా గురించే మాట్లాడుతారు. ఏ సర్కారుకయినా ఇంతకంటే మేలు ఎవరు చేస్తారు. ఈ పోస్టుకు తగిన వాడు ‘రేవంత్‌ రెడ్డి’ వున్నా, ఆయన తెలంగాణలో వుండి పోయాడు కనుక, ఆంధ్రప్రదేశ్‌లో ఆ స్థానం ఖాళీగా వుండి పోయింది. ఈ పోస్టుకు నా కన్నా అర్హుడెవరు? అందుకని ఇలా దరఖాస్తు చెయ్యగానే, అలా అంగీకరించేశారు. ‘బయ్‌ వన్‌ గెట్‌ వన్‌ ‘ స్కీమ్‌ కింద, నా తమ్ముడు రామ్‌ నారాయణ రెడ్డిని కూడా ఆయన కిస్తున్నాను.)

‘గో’మిత్‌ షా!

పేరు : అమిత్‌ భాయ్‌ అనిల్‌ చంద్ర షా (చిన్నబుచ్చితే) అమిత్‌ షా

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘కవ్‌’ బాయ్‌ ( ఏం? సినిమాల్లోనే గానే రాజకీయాల్లో ‘కవ్‌ బాయ్స్‌’ వుండకూడదా? ‘గోవు’ పవిత్రమైన జంతువు అని కుర్రాళ్ళంతా ‘కవ్‌ బాయ్స్‌’ కారా?

వయసు : మేం బీజేపీలో ‘బాయ్స్‌’ మే. నేను యాభయిలలో వున్నా, మోడీ అరవయిలలో వున్నా మేం ‘బాలురం’ కిందే లెక్కే, ఎందుకంటే, అద్వానీజీ, మురళీ మనోహర్‌ జోషీజీలు ఎనభయిలల్లో వుంటూ ‘యవ్వనుల్లా’గా కుర్చీలకు పోటీ పడుతున్నారు కదా!

ముద్దు పేర్లు :’గో’మిత్‌ షా( గోవు అంటే ఆవు. మిత్‌ అంటే కల్పన. రెండూ చేసింది నేనే. బీహార్‌ ప్రజలు గోవును పవిత్రంగానే స్వీకరించారు. బీజేపీ అంటే గోవు, గోవు అంటే బీజేపీ అని నమ్మారు. తదనుగుణంగానే మాకు తీర్పు ఇచ్చారు. 243 సీట్లకీ 58 సీట్లే ఇచ్చారు. ‘గంగి గోవు పాలు గరిటడయినను చాలు’ అంటారు. )

వీధిలో ‘రాజయ్య’- ఇంట్లో ‘మామయ్య’

పేరు : సిరిసిల్ల రాజయ్య

దరఖాస్తు చేయు ఉద్యోగం: నష్ట జాతకుడు ( వరంగల్‌ పార్లమెంటు సీటు ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ తరపున నామినేషన్‌ వేసి కూడా ఉపసంహరణకు ముందే పోటీలోనుంచి తప్పుకోవాల్సి వచ్చిన అభ్యర్థిని ఏమంటారు?)

వయసు : షష్టి పూర్తి చేసుకుని రెండేళ్ళ అయ్యింది. అయితే మాత్రం ఇప్పుడే కాలేజీలో చేరిన కుర్రవాడి స్పిరిట్‌ మనకుంటుంది. ( అందుకే కదా, న్యూ యియర్‌ పార్టీలో ‘కాలేజీ పోరగాల్ల లెక్క చిందులేసిన’. మనస్టెప్పులు చూస్తే పడి పోవాల్సిందే. అఫ్‌ కోర్స్‌ రాజకీయాల్లో నేను వేసిన రాంగ్‌ స్టెప్స్‌కు నేనే పడిపోయాను. అది వేరే విషయం.)

‘మహిళా స్ట్రింగ్‌’ యాదవ్‌!

పేరు : ములాయంసింగ్‌ యాదవ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: అత్యాచార నిందితుల హక్కుల పరిరక్షకుడు (అ.ని.హ.ప)

వయసు : అరవయి నాలుగేళ్ళప్పుడు రెండోపెళ్ళి చేసికొని, సీనియర్‌ సిటిజన్లకు దిశానిర్దేశం చేసిన వాణ్ణి . నన్ను వయసు అడగటం పధ్ధతి కాదు. (అఫ్‌ కోర్స్‌ ఇలాంటి అవకాశం దేశంలో స్త్రీలకు ఇంకా వచ్చి వుండక పోవచ్చు.)

ముద్దు పేర్లు : ‘మల్ల’యాం సింగ్‌ యాదవ్‌( నేను మల్లయోధుణ్ణి లెండి. ఒకప్పుడు కండలుపెంచిన వస్తాదును కూడా.) ‘మహిళా’ ‘స్ట్రింగ్‌’ యాదవ్‌. (మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల పై స్ట్రింగ్‌ అపరేషన్‌ చేసిన వాణ్ణి. కాబట్టే ‘సామూహిక అత్యాచారాలు’ ఆచరణ సాధ్యం కావని తేల్చి చెప్పగలిగాను.