ఎందుకనో ‘వాంప్’ పాత్రలు వేసే జ్యోతిలక్ష్మీ, జయమాలిని లాంటి వాళ్ళ పేర్ల చివర ‘గారు’ అనే మాట వుంచలేకపోయేవాళ్ళం.
మా సత్యం అలాకాదు.
‘జయమాలిని గారు ఆ క్లబ్ డాన్స్ బాగా చేశారు’ అని అనేవాడు.
తెగిపోతున్న మానవసంబంధాలకు అద్దం పట్టే వ్యంగ్య కథలు.
ధైర్యం గురించి పిరికివాళ్ళు లెక్చర్లు దంచినట్టుగా – ఎవ్వరూ దంచలేరు. ఉత్తర కుమారుడు మాట్లాడినట్లు అర్జునుడు మాట్లాడలేడు కదా!
ధైర్యం గురించి ఎవర్ని అడిగినా చాలా పెద్ద పెద్ద ఉదాహరణలిస్తుంటారు. గుండుకు బదులు గుండె చూపిన నాయకుడి గురించో, నవ్వుతూ ఉరికంబం ఎక్కిన వీరుడి గురించో మాట్లాడతారు.
అంతంత పెద్ద విషయాల గురించి ఎందుగ్గానీ, చిన్న చిన్న విషయాల్లో ధైర్యం ఉంటుందా…?