
మా వాడికుండే ఈ ‘అపారమైన బలహీనత’తో పుణ్యకార్యమేదైనా సాధించవచ్చా? నాకు ఒక ఆలోచన క్లిక్ అయ్యింది. ఒక సినిమా పత్రికలో విలేఖరిగా చేర్చాను. ఆ ఉద్యోగం ఒక్క రోజు కన్నా ఎక్కువ చెయ్యడని బాగా తెలుసు. కాని మా కిష్టిగాడి వల్ల ఒక్క రోజయినా లోక కళ్యాణం సాధ్యమవుతుందని చిగురంత ఆశ!