ఇలా రాసిందే రచన- అని ఏ రచయితనీ బెదరించలేం. ఇలా పెట్టిందే గుడ్డు- అని ఏ పిట్టనీ
వణికించలేం. అలా చేస్తే రాసింది రచనా కాదు. పెట్టింది గుడ్డూ కాదు. రచయితలంతా పుస్తకాలలోనుంచో,
విశ్వవిద్యాలయాల్లోంచో, పత్రికల్లోంచో పుట్టుకురావాలన్న షరతు కూడా లేదు. కల్లు కాంపౌండులోంచో, రెడ్ లైట్
ఏరియాలోంచో, వెలివాడలోంచో రచయిత పుట్టుకురావచ్చు. గుడ్లు పెట్టే వన్నీ ఫోరం కోళ్ళే కావాలని రూలు
లేదు. అడవిలోని కోడి కూడా గుడ్డు పెడుతుంది.
కెమెరా విజయకుమార్ రాయలని పథకం వేసుకుని రాయలేదు. రాయకుండా వుండలేక
రాసేశాడు. తాను వెనక్కి తిరిగి చూసుకునే సరికి రచయిత అయిపోయాడు. ఇంకేచేస్తాడు? తప్పించుకోలేడు.
ఊరందరి బెంగల్నీ మొయ్యాల్సిందే. అందుక్కూడా ఆయన సిధ్ధపడ్డాడు. కానీ ఊరువరకూ ఆయన్ని వెళ్ళనిస్తే
కదా! వాడ బెంగలే కాళ్ళకు చుట్టుకున్నాయి. ఇంక కదలితే వొట్టు.
Read more →