ఒకటి పెంగ్విన్ పిల్లలా నాన్న సైకిల్ మీద నేను చక్రాల కింద చిన్నబుచ్చుకున్న సముద్రాలు కన్ననేరానికి కాళ్ళాడిస్తున్నారాయన నడుపుతున్నానన్న భ్రమలో రెక్కలాడిస్తూనేను ”ఎక్కడికిరా కన్నా?” నా శిరస్సునడిగింది నాన్న గెడ్డం ”ఊరవతలకి!” దిక్సూచిలా నా చూపుడువేలు ఛెళ్ళుమన్నది సముద్రం నాన్న చెక్కిళ్ళన్నీ నీళ్ళే మలుపు తిరిగామో లేదో నా బుగ్గలమీదా అవే నీళ్ళు ”నాన్నా! ఉప్పగా…