
Final decision on T will Reveal Today. Discussion with Political Analyst Prakash, BJP MLA Laxmi Narayana, Congress Palvai Govardhan in Morning Edition.
పేరు : బొత్స సత్యనారాయణ
దరఖాస్తు చేయు ఉద్యోగం: సమైక్యవాద నేత (నేను కూడా సమైక్యవాదినని, సీమాంధ్ర వాసులు ఒప్పుకుంటే అదే పదివేలు. గతంలో నేను రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన విషయాన్ని వారు మరచిపోవటం కోసం, నేను ఏం చెయ్యటానికయినా సిద్ధంగా వున్నాను.)
ముద్దు పేరు :సత్తి బాబు, ‘సమైక్య’ బాబు. గొడ మీద బొబ్బిలి పులి.( ఎటు కావాలంటే అటు దూకుతుంది.)
పేరు :లాల్ కృష్ణ అద్వానీ
దరఖాస్తు చేయు ఉద్యోగం: లేదు. పోస్టు భర్తీ చేయబడినది. నా కన్నా చిన్నవాడయిన నరేంద్రమోడీతో ఆ ఖాళీని(బీజేపీ 2014 ఎన్నికల ప్రధాని అభ్యర్థిని) పూరించారు. ఇప్పుడు అద్వానీ అన్నది పేరు కాదు, చరిత్రలో పోస్టుగా కూడా మిగులుతుంది. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్న ఆనందంతో ‘కృష్ణా! రామా!’ అంటూ గడిపేస్తున్నాను.
ముద్దు పేర్లు :‘మోడ్వా’నీ ( మోడీ యే ప్రధాని గా బాగుంటాడని ఒప్పేసుకున్నాను లెండి.)’
పేరు : కిరణ్ కుమార్ రెడ్డి
దరఖాస్తు చేయు ఉద్యోగం: రెండు ఉద్యోగాలు. ఒకటి: ‘లాస్ట్ ఎంపరర్'(సమైక్యాంధ్ర ప్రదేశ్ కు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా నేనే వుండాలి.) రెండు: ఫస్ట్ ఎంపరర్( సీమాంధ్రకు తొట్టతొలి ముఖ్యమంత్రి పోస్టుకు కూడా దరఖాస్తు చేస్తున్నాను.)
ముద్దు పేర్లు :కి.కు( ఇది నా పొట్టి పేరు. పూర్వం కాంగ్రెస్‌లో ‘క’ గుణింతం వుండేది. ‘కాకా’, ‘కికు’ ‘కేకే’లము కీలకమైన నేతలం. ‘కాకా’ (జి.వెంకటస్వామి) సంగతి ఎలాగున్నా, ఆయన కుటుంబసభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ‘కేకే’ కూడా టీఆర్‌ఎస్‌లోకే వెళ్ళిపోయారు.
రాహుల్ మోడీ!
నరేంద్ర గాంధీ!
అనుమానం లేదు. మీరు సరిగానే చదివారు. ఇద్దరూ ప్రధాన అభ్యర్థులే. కానీ రూపాలు మారలేదు. కానీ గొంతులే మారాయి.
రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీ, నరేంద్రమోడీకి రాహుల్ గాంధీ వచ్చి డబ్బింగ్ చెప్పినట్లుంది. ఒకరి మాటలు ఒకరు మాట్లాడేస్తున్నారు. వారి సభలకు వచ్చిన వారూ, వాటిని టీవీల ముందు కూర్చుని వింటున్న వారూ, కాస్సేపు తమని తాము గిల్లి చూసుకుంటున్నారు.
కలయా?నిజమా? వైష్ణవ మాయా?
అఫ్ కోర్స్. కలయే. ఎన్ని ‘కల’యే.
కొంచెం దిగులు. కాస్త కంటి తడి. పిసరంత ఆనందం. పెదవుల మీదకు వచ్చిపోయిన చిరునవ్వు. ఇవి చాలు, గుంపు నుంచి పారిపోవటానికి. మొబైల్ మోగని, టీవీ కనబడని, డియోడరెంట్ వాసన రాని, కృత్రిమ కర స్పర్శలేని, పిజ్జాలతో రుచిచెడని చోటకు నా అంతట నేను వెళ్ళిపోతాను. అజ్ఞాతానికి అరణ్యమే అవసరంలేదు. వాకిలి చాలు, కారిడార్ చాలు, బాల్కనీ చాలు. వీటన్నిటి కంటే బాత్ రూమ్ మేలు. ఇష్టమైన తలపులతో నిలువెల్లా తడిసిపోతున్నప్పుడు ఎవరూ ఉండకూడదు. నా కలల హైవేలో నేను వెళ్తున్నప్పుడు, ఎదురుగా ఒక్క వాహనమూ కనపడకూడదు. నా ఇష్టం వచ్చినప్పుడు తిరిగి వస్తాను. ప్లీజ్ తలుపులు దబదబా బాదకండి. వెనక నుంచి హారన్ల రొద చేయకండి.
శుభం కార్డు పడ్డాక, కూడా క్లయిమాక్సు కొనసాగే సినిమా చూశారా? అయితే చూడండి. యూపీయే ప్రొడక్షన్స్ వారి ‘రాష్ట్ర విభజన’ అనే చిత్రం అలాంటిదే. ఆంధ్రప్రదేశ్‌నుంచి తెలంగాణను వేరు చేసి రాష్ట్రంగా గుర్తించాలంటూ కేంద్ర కేబినెట్ చేసిన చేసిన తీర్మానం తర్వాత కూడా సినిమా కొనసాగుతోంది.
ముగిసింది కదా, అని థియేటర్లో తమ కుర్చీలలోంచి ప్రేక్షకులు పలుమార్లు లేవటం, కొనసాగుతుంటే మళ్ళీ కూర్చోవటం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇప్పటి రాష్ట్ర రాజకీయం అలాగే వుంది.
సతీష్ చందర్ ఎలా మాట్లాడతారో, ఆలా రాస్తారనీ, ఆయన చతురోక్తుల్లో విజ్ఞానం దాగి వుంటుందని, తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఛైర్మన్ ఎం. వేదకుమార్ అన్నారు. సతీష్ చందర్ రచించిన వ్యంగ్య గ్రంథం ‘కింగ్‌మేకర్’ ను ఆయన 29 అక్టోబర్ 2013 న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్ లో ఆవిష్కరించారు. సతీష్ చందర్ తో తనకున్న రెండు దశాబ్దాల స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఏ పత్రికలో సంపాదకుడిగా పనిచేసినా, ఆ పత్రికను కొత్త పంథాలో నడిపించారన్నారు. ప్రత్యేకించి అట్టడుగు వర్గాల వేదనను ఆయన పలికిస్తారన్నారు.
ప్రేమ వున్న చోటే అలకా వుంటుంది.
ప్రజాస్వామ్యం వున్న చోటా నిరసనా వుంటుంది.
అలకలే లేవంటే ఆప్యాయతలే లేవని అర్థం. ఈ మధ్య కొన్ని కాపురాల్లో అలకల జాడలే కనిపించటం లేదు. ఎవరి వాటా ప్రకారం వారి లాభాలు తీసుకుపోయే భాగస్వామ్య వ్యాపారాల లాగా ఈ సంసారాలు సాగిపోతున్నాయి.
ఆయన అర్థరాత్రి దాటి ఇంటికి వచ్చినా, ‘ఎందుకూ?’ అని ఒక్క మాట కూడా అడగదు.
ఆమె ఏమి వండిపెట్టినా, ‘ఇది బాగుంది. బాగాలేదు.’ అని ఒక్క వ్యాఖ్యా ఆయన చేయడు.