అదేమిటోకానీ, అద్వానీకి అందలం అందినట్టే అంది జారిపోతుంటుంది. ఒకప్పుడు వాజ్ పేయీ తన్నుకుపోతే, ఇప్పుడు మోడీ ఎత్తుకు పోయేటట్టు వున్నారు. ప్రధాని పదవే అలాంటిది. కొందరు ఎంత ఆశించినా దొరకదు. కొందరు ఆశించకపోయినా వచ్చేస్తుంది. బహుశా ఏకారణం చేతనేనేమో- మన్‌మోహన్ సింగ్‌ను చూస్తే, అద్వానీకి ‘అకారణం’గా కోపం వచ్చేది. ఇది గమనించిన మన్‌మోహన్ ఒకటి రెండు సందర్భాలలో ‘ఆయన బాధను నేను అర్థం చేసుకోగలను’ అని పైకి అనేశారు కూడా.
ఏడుపు గొట్టు పథకాలు!

ఏడ్వని కొడుకును చూసి తల్లిదండ్రులు ఒక్కటే ఏడుపు.
తిట్టినా, చితగ్గొట్టేసినా, నిలువునా చీరేసినా ఏడ్వటం లేదు. పైపెచ్చు ఒంటి మీద చెయ్యేస్తే చాలు-కితకితలు పెడుతున్నట్టుంటుంది వాడికి. దాంతో ఒక్కటే నవ్వు.
వాళ్ళ వృత్తికి ఏడుపే జీవనాధారం. ఏడ్వనిదే పూట గడవదు. పగటిపూట గడిచినా రాత్రి పూట అసలు గడవదు. పేవ్‌మెంట్ మీద పడుకోగానే నిద్రపట్టి చావదు. కప్పుకోవటానికి రగ్గున్నా లేకున్నా, కడుపు వెచ్చబెట్టుకోవటానికి ఒక్క ‘పెగ్గు’ అన్నా పడాలి.
డియల్.. డియల్… డియ్యాలో..!!

పేరు : డి.యల్. రవీంద్రారెడ్డి
ముద్దు పేరు : ‘డియ్యాలో’
విద్యార్హతలు : ‘అసమ్మతి’లో పోస్ట్ గ్రాడ్యుయేషన్
హోదాలు : నాకే హోదా కొత్త కాదు. శాసన సభ్యత్వమూ కొత్త కాదు.(ఆరు సార్లు మైదుకూరు స్థానంనుంచి ఎన్నికయ్యాను.) మంత్రి పదవి అస్సలు కొత్త కాదు. పలువురు మఖ్యమంత్రుల కేబినెట్ల వున్నాను. ఎటొచ్చీ ఇప్పుడు వచ్చిన హోదా యే కొత్త. అదే ‘తొలగించబడ్డ మంత్రి
‘ఇచ్చే’ పార్టీనుంచి, ‘తెచ్చే’ పార్టీకి!!

ఆరోపణలు ఆరోపణలే. ఆకర్షణలు ఆకర్షణలే. ‘గులాబీ’ తీరే అంత. ముళ్ళు ముళ్ళే. మోజులు మోజులే.
ముళ్ళున్నాయని ‘గులాబీ’ చెంతకు వెళ్ళటం మానేస్తామా? కాంగ్రెస్ ఎంపీలు వివేక్. మందా జగన్నాథంలకు పని చేసి వుండవచ్చు. అందుకే, వెనకా, ముందు చూసి కూడా కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి దూకేశారు. వివేక్ సోదరుడు వినోద్ కూడా ఇదే బాటలో వున్నారు.
‘గ్లాసు’ జారి, ‘ఒళ్ళం’తయ్యిందే..!

గ్లాసే కదా- అని కొట్టి పారెయ్యలేం. ఒక్క గ్లాసు తో మనిషి తూలిపోవటం మామూలే. కానీ అదే గ్లాసుతో రాజ్యాలకు రాజ్యాలే కూలిపోయాయి. మన కళ్ళముందే 1994లో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూలిపోయింది. అవును. సారా గ్లాసుతోనే.
దాంతో గ్లాసుల్లేని రాజ్యాన్ని తెస్తానని ఎన్టీఆర్ భీషణ ప్రతిజ్ఞచేసి, మరో మారు గద్దెనెక్కారు. అనుకున్నట్టుగా ప్రమాణ స్వీకారం రోజునే తొలి సంతకం మీద ‘గ్లాసు బోర్లించారు’. మద్య నిషేధాన్ని అమలులోకి తెచ్చారు.
ఊరక దూకరు మహానుభావులు!

అదే మొబైల్. అదే నెంబరు. మారేది ‘సిమ్ కార్డే’
అదే పదవి(ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు.) వీలైతే అదే నియోజకవర్గం. మారేది ‘కండువాయే’
రెండు పనులూ ఒకటే. మొదటి దానిని ‘నెంబర్ పోర్టబిలిటీ’ అంటారు. ఎయిర్‌టెల్ నుంచి టాటా డోకోమోకి మారినా అదే నెంబరు వుంటుంది. రెండో దానిని ‘మెంబర్ పోర్టబిలిటీ’ అంటే ‘మెంబర్’ ఆఫ్ పార్లమెంటు(ఎంపీ) లేదా ‘మెంబర్’ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ(ఎమ్యెల్యేలు) గతంలో ఎక్కడనుంచి కాంగ్రెస్ పార్టీనుంచి ఎన్నికయ్యారో, మళ్ళీ అక్కడ నుంచే టీఆర్ ఎస్ నుంచి ఎన్నిక కావచ్చు.
‘ఆలి‘ ఖైదాలు!

సూర్యరశ్మి సోకకుండా అత్యంత సుకుమారంగా అంత:పురాలలో వుండే స్త్రీలను అసూర్యంపశ్యలని అని అనేవారు. మహిళలకు భద్రత చాలు, స్వేఛ్చ ఎందుకనే రోజులవి. కానీ పరదాలను దాటుకుని రావటానికి ఆరాటపడుతూనే వున్నారు. వారు బయిటకు వచ్చి అన్ని రంగాలలోనూ తమ ఉన్నతిని చాటుకుంటున్నా, ఈ సూర్యుడనేవాడు ఇంకా వెంటాడుతూనే వున్నవాడు. దాంతో అతణ్ణి మాత్రమే తప్పించుకోవటానికి వారు ముసుగులు ధరించి ‘ఉగ్ర‘వాదులు గా మారణం తప్పటం లేదు. పురుషాధిపత్యం మీద కూడా ఏదో ఒక నాడు వారు నిజంగానే ఈ ‘ఉగ్ర’ రూపం దాల్చక తప్పదేమో.
‘ఆపధ్ధర్మాన’ ప్రసాద రావు
‘మ్యాచ్ ఫిక్సింగు’లు కావు, అన్నీ ‘స్పాట్ ఫిక్సింగు’లే!?

క్రికెట్‌లోనే క్రీడాకారులు’మ్యాచ్ ఫిక్సింగ్’ల నుంచి ‘స్పాట్ ఫిక్సింగ్’ల వరకూ వచ్చేశారు. రాజకీయ ఆటగాళ్ళు రాకుండా వుంటారా? వాళ్ళ కన్నా ముందే వచ్చేసి వుంటారు.
మన రాష్ట్రమే తీసుకోండి. ప్రతీ పార్టీ- మరో రెండు పార్టీల మధ్య ‘మ్యాచ్ ఫిక్సింగ్’ జరిగిపోయందని ఆరోపిస్తుంది. ఈ ‘మ్యాచ్ ఫిక్సింగ్’ కాంగ్రెస్-వైయస్సార్ కాంగ్రెస్‌ల మధ్య జరిగిపోయిందని తెలుగుదేశం ఆడిపోసుకుంటే; కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీ ల మధ్య జరిగిపోయిందని వైయస్సార్ కాంగ్రెస్ ఎత్తి పొడుస్తుంటుంది.
ప్రజాస్వామ్యంలో ‘రాచకుటుంబాలు’!

పార్టీ అన్నాక ఓ అధినేత వుంటాడు. ఆ అధినేతకు ఓ కుటుంబం వుంటుంది. ఆ కుటుంబంలో సభ్యులుంటారు. సభ్యులనందరినీ అధినేత ఒకేలా చూడొచ్చు. కానీ ఏదో ఒక సభ్యుడికి తనను తక్కువ చూస్తున్నారన్న భావన కలగ వచ్చు. ఆ భావన పెరిగి పెద్దదయితే కలహానికి దారి తీయ వచ్చు. ఇంకా పెద్దదయితే ఆ సభ్యుడు ‘అసభ్యుడ’ వుతాడు. వేరే పార్టీ కూడా పెడతాడు.
అయినా పార్టీ మొత్తం ఒక కుటుంబం చేతిలో వుండటం ఏమిటి? ఇది రాచరికమా?
శత్రువే సంస్కర్త

శత్రువు మించిన గొప్ప సంస్కర్త ఉండడు. తెల్లని బియ్యంలో నల్లని రాళ్లను తీసినట్టు, ‘ఒప్పుల’
కుప్పలాంటి మన జీవితంలోంచి ‘తప్పుల’ను ఏరి ఇస్తాడు. ఈ పని మిత్రులవల్ల కాదు.
వ్యక్తి విషయంలోనే కాదు. సంస్థ విషయంలోనూ, ఒక పార్టీ విషయంలోనూ ఇదే నిజం.
ఏ రాజకీయ పార్టీ అయినా బాగుపడాలి అంటే, అది శత్రుపక్షం మీద ఆధారపడి ఉంటుంది. ఈ
మధ్యకాలంలో కొన్ని పార్టీలు అలా బాగుపడిపోతున్నాయి. ఒక పార్టీమీద శత్రుపక్షం ఇంత ప్రేమ
చూపిస్తుందంటే, నాటకం అనుకునే వాళ్లం. కానీ అది నాటకం కాదూ, ‘కర్ణాటకం’ అని
బోధపడిపోయింది.
సి ఫర్ ‘కాపు’ చంద్రయ్య!

పేరు : సి(చెన్నంశెట్టి). రామచంద్రయ్య
ముద్దు పేరు : సి ఫర్ ‘కాపు’ చంద్రయ్య.(కాపులను బీసీలో చేర్చాలని కోరుతున్నాను.)
విద్యార్హతలు : లెక్కల్లో మనిషిని.(ఒకప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్‌ను లెండి.) ఇప్పుడు కూడా లెక్కలు తప్పటం లేదు. కాపులు+బీసీలు= కాంగ్రెస్ అని అంటున్నాను. (సీమాంధ్రలో రెడ్లూ, దళితులూ వైయస్సార్ కాంగ్రెస్‌లోకి జారుకుంటున్నారు కదా! అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చిరునామా మిగలాలంటే నా ‘లెక్క’ను పాటించాల్సిందే. (కాపుల్ని కూడా బీసీల్లో కలిపేస్తే మొత్తం బీసీలయిపోతారు.)
