దిగ్వివాద సింగ్‌!

పేరు : దిగ్విజయ్‌ సింగ్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: ఎలక్షన్‌ ‘డేమే’జర్‌ ( ఎలక్షన్‌ మేనేజ్‌ మెంట్‌ అన్నది పాత మాట. ఎలక్షన్‌ ‘డేమే’జ్‌ మెంట్‌ అన్నది కొత్త బాట. గోవా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఇన్‌ చార్జ్‌గా నేను ఇదే అవలంభించాను. మన వల్ల శత్రుపక్షం ‘డేమేజ్‌’ అవ్వాలి. నిజానికి ఈ (2017) ఎన్నికల్లో…

మహరాజునే వెలి వేస్తే….!?

వేదం వినాలనీ, వేదం అనాలనీ..నేడు పెద్దగా ఎవరికీ అనిపించక పోవచ్చు. అర్థం తెలుసుకోవాలనే యావ కూడా ఎవరికీ వుండక పోవచ్చు. పెద్ద పెద్ద ఉత్సవాల్లో, కడకు సర్కారీ ఉత్సవాల్లో వేద మంత్రోచ్చరణలు లేక పోతే వెలితిగా భావిస్తారేమో కానీ, తీరా పఠిస్తే పట్టించుకోరు. మీడియా ప్రతినిథులు కూడా ఉత్సవాల్లో నాయకులేం మాట్లాడతారో వింటారు కానీ, వేద…

మిరపా..! మిరపా..! ఎందుకు ‘మండా’వ్‌?

మండే మిరప తెగ పండింది. పండగే అనుకున్నాడు రైతు. కొనే వాడొచ్చాక కానీ,తెలియ లేదు.. మిరప అంటే పంట కాదు… మంట.. అని. అమ్మాలని వస్తే, తెగనమ్మాల్సి వచ్చింది. క్వింటల్‌కు కనీసం రు.12,000 వస్తాయనుకున్నాడు. మరీ మూడు వేలకు అమ్మమంటే, కడుపు మండి పోయింది. వంటల్లో మండాల్సిన పంట, నిప్పుల్లో మండింది. ఇది ఖమ్మం ఘటన.…

‘ఆప్’ వింద్ ’చీపురు‘వాల్!

పేరు : అరవింద్‌ కేజ్రీవాల్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: ఏక్‌ నిరంజన్‌ ( ఢిల్లీ మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల తర్వాత ఒక్కొక్కరు పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. ఎవరు వెళ్ళిపోయినా సరే.. ఒంటరి పోరుకు సిధ్ధపడుతున్నాను.) వయసు : పోరాడే వయసు.. పాలించే వయసు కాదు. ఈ విషయాన్ని ఢిల్లీ పౌరులు ఇప్పటికి గుర్తించారు. తొలి సారి…

తొందరపడి ‘చంద్రులు’ ముందే వెలిగారు!

ద్వేషాలూ, అవసరాలూ- ఈ రెండే ఎన్నికల్లో అమ్మకపు సరకులు. ద్వేషం ఇలా పుట్టి అలా చల్లారిపోతుంది. ఒక అవసరం తీరిన వెంటనే ఇంకొకటి పుట్టుకొస్తుంది. అందుకే ద్వేషాన్ని రగులుస్తూ వుండాలి; మైనారిటీ వోటర్ల మీద మెజారిటీ వోటర్లను ఎగదోస్తూ వుండాలి. తీర్చిన అవసరాలను గుర్తు చేస్తూ వుండాలి; ‘అమవాస్య నాడు అట్టు పెట్టాను, పౌర్ణమి నాడు…

‘ఉత్తరు’ణ్‌ విజయ్‌!

పేరు : తరుణ్‌ విజయ్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘ఉత్తర’ భారత పౌరుడు ( భారతమంటేనే ఉత్తర భారతం. ఇదే ‘శ్వేత’ భారతం. ‘దక్షిణ’ భారతీయులు కూడా వుండవచ్చు. కానీ ఉత్తర భారతీయులకు విధేయులుగా.) వయసు : వివాదాల్లో తల దూర్చే వయసు కాదు. వివాదాలను సృష్టించే వయసు. (ఒకప్పుడు నేను ఆర్‌ ఎస్‌ ఎస్‌…

పోరుగడ్డ మీద ‘పరువు’ హత్యలా..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళవుతోంది. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్‌ అందలమెక్కింది. అంకెల్లో చూస్తే పాలన అద్భుతంగా వున్నట్లుంటుంది. అక్షరాలా ఎలావుందన్నదే ప్రశ్న. ముందుకు వెళ్తుందా..? వెనక్కి వెళ్తుందా? అసలిదేం ప్రశ్న? సార్వత్రిక ఎన్నికలే కాదు, తర్వాత ఏ ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసేసింది. విపక్షాలు విలవిలలాడిపోయాయి. చిన్నా చితకా నేతలు…

యూపీలో విజ‌యం: మోడీ మంత్రం కాదు; కుల, మతాల తంత్రం!

మినీ భారతంగా పేరుగాంచిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మరోమారు తన కాషాయపతాకాన్ని ఎగుర వేసింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో 80 పార్లమెంటు సీట్లకూ 73 స్థానాలను గెలుచుకున్న బీజేపీ, కొంచెం తేడాలో రెండేళ్ళ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే వేగాన్ని కొనసాగించింది. 403 స్థానాలలో 324 సీట్లను గెలుచుకుని, కలసి పోటీ పడ్డ సమాజ్‌ వాదీ…

డొనాల్డ్‌ ‘జంప్‌’

పేరు : డొనాల్డ్‌ ట్రంప్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: హాఫ్‌ అమెరికన్‌ ప్రెసిడెంట్‌( అమెరికాలో సగం మంది నాకు వ్యతిరేకంగా వున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని నేను ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు ఇవ్వను.) ముద్దు పేర్లు : డొనాల్డ్‌ ‘జంప్‌’ ( ఈ చివరనుంచి ఆ చివరకు జంప్‌ చెయ్యగలను. వలస రావటానికి వీలుకాదని చెప్పిన ఏడు…

రాజ‌ధాని అంటే క‌ట్ట‌డం కాదు..న‌మ్మ‌కం!

ఒక చారిత్రక సన్నివేశం. ఓ ఉద్విగ్న సందర్భం కూడా. సీమాంధ్ర ప్రజల సుధీర్ఘ స్వప్నానికి ఓ దృశ్యరూపం గా అమరావతిలో చట్ట సభలు కొలువు తీరాయి. ఒక రాజధాని వెంట ఒక ప్రజాసమూహం దశాబ్దాలు తరబడి వెంటపడటం అరుదయిన పరిణామం. అది సీమాంధ్ర ప్రజలకే చెల్లింది. ఒక రాష్ట్రం కోసం వెంపర్లాడటం వేరు. ఒక రాజధానికోసం…

‘ఎగస్ట్రా’లిన్‌!

పేరు : ముతువేల్‌ కరుణానిధి స్టాలిన్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: మధ్యంతర ముఖ్యమంత్రి( ఎఐఎడిఎంకె ప్రభుత్వం మధ్యలో కూలి పోతే ముఖ్యమంత్రి మనకే వస్తుంది కదా!) ముద్దు పేర్లు : ‘ఎక్‌స్ట్రా’లిన్‌( ఇతరుల చేసే ఏ పనిలోనయినా నా కంటూ కొంచెం ఎక్‌స్ట్రా వుంటుంది. నా సోదరుడు అళగిరి చేసిన దానికన్నా ఎంతో కొంత అదనంగా…

‘దేశ భక్తి’ ముసుగులో ‘ద్వేష’ భక్తి!

బ్యాలెట్‌ భాష ద్వేషం అయినప్పుడు, బులెట్‌ భాష ద్వేషం కాకుండా పోతుందా? ‘అమెరికాయే ముందు’ అనీ ‘అమెరికన్లే ముందు’ అని ప్రమాణ స్వీకారం నాడే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భీషణ ప్రతిజ్ఞ చేశారు. కొందరికిది ‘దేశభక్తి’లాగా కనిపించ వచ్చు. కానీ ఇది ‘ద్వేష భక్తి’ అని రాను రాను తెలుస్తూ వచ్చింది. అమెరికాయే వలసలు…