కేవలం ముగ్గురు మహిళల్ని ఎదుర్కోవటానికి కాంగ్రెస్ కు ఇతర మహిళా నేతలు అవసరమవుతారు.
ఇప్పటికకే రేణుకా చౌదరి విజయమ్మ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
కానీ, ఆమెకు రాష్ట్రవ్యాపితంగా అంత ప్రజాదరణ వుండక పోవచ్చు.
ఈ ముగ్గురు మహిళల ప్రభంజనం ఇంకా పెరిగితే, ముఖ్యమంత్రి స్థానంలో కూడా మహిళానేతను కూర్చోబెట్టే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చెయ్యవచ్చు.
తామే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకోవటం కోసమయినా ఈ పని చెయ్యాల్సి వస్తుంది.