మరో మారు దేశ విభజన జరిగింది. ఈ సారి కూడా దేశం రెండుగా విడిపోయింది. కానీ అవి పాకిస్తాన్-ఇండియాలు కావు. భారత్-ఇండియాలు. అంత తేలిగ్గా జరిగిపోతుందా? భజనకీ, విభజనకీ ఒక్క అక్షరమే తేడా. భక్తి వుంటే భజన, విరక్తి వుంటే విభజన. ఇండియా మీద విరక్తి కలిగింది ఒక దేశభక్తుడికి. దాంతో ఈ నిర్ణయానికి వచ్చేశారు. ఆయన దృష్టిలో నగరాలు వుండే ది ఇండియా, పల్లెలు వుండేది భారత్.