Tag: వ్యంగ్యం

నవ్వు వెనక ఏడుపు!

నవ్వూ మందే.

ఇది తెలిసి పోయాక, పార్కుల్లో పువ్వులు బదులు, నవ్వులు పూసేస్తున్నాయి. చెట్లు కాదు, చెట్లంతంటి మనుషులు నవ్వేస్తున్నారు. ఎవరో చచ్చిపోతే, గుమిగూడి ఏడ్చినంత బిగ్గరగా గుండెలు పగిలేలా నవ్వేస్తున్నారు. ఇంకా చీకట్లు విడిపోకుండా, తెల్లవారకుండానే, క్రోటన్‌ పొదల మాటను తెల్లని దుస్తులతో, నిలబడి నవ్వుతుంటే, విఠలాచార్య తీసిన పాత సినిమాల్లో ‘కామెడీ దయ్యాలు’ నవ్వినంత విలాసంగా నవ్వేస్తున్నారు. చెమటోడ్చి, దిక్కులు పిక్కటిల్లేలా నవ్వేస్తున్నారు.

రాజకీయాల్లో ‘క’ గుణింతం!

‘గురూజీ?’
‘వాట్ శిష్యా!’

‘తెలంగాణ ఉద్యమం అంతా ‘క’ గుణింతంతో నడుస్తున్నట్టున్నది..?’
‘అంటే ఏమిటి శిష్యా..!?’

‘ఏముందీ..? తెలంగాణ ఉద్యమ నేతల పేర్లు తీసుకోండి. ఇప్పుడు ‘కేకే’ ఉన్నారు. నిన్నటి దాకా ‘కాకా’ కూడా చురుగ్గా వుండేవారు. ఇక ‘కే’సీఆర్ కుటుంబమంతా ‘క’ గుణింతమే.