Tag: సతీష్ చందర్ వ్యంగ్యం

ప్రేమ దొరికేది తొమ్మిది సైట్ల లో..!

ఈ నూటొక్క ప్రేమ కథలూ తొమ్మిది సైట్లలో దొరకుతాయి. ఒక్కొక్క సైట్లలోనూ డజను వరకూ వుంటాయి. నిజానికి నూటొక్క కథలంటున్నాను కానీ, రాసింది మాత్రం నూటొక్క మనస్తత్వాలు. అవి లవ్వున్న జీివితాలు, నవ్వున్న మనస్తత్వాలు:

నిగ్రహం కోల్పోయిన ‘విగ్రహ’ వాక్యం!

ఉలకని, పలకని వాళ్ళని పట్టుకుని- ‘అలా బొమ్మలా నిలుచున్నావేమిటి?’ అని అనకండి. బొమ్మలు కదలగలవు. కదిలించగలవు. కొంపలు అంటించగలవు.
మనిషి విగ్రహమయ్యాక వంద రెట్లు శక్తిమంతుడయిపోతాడు. మనిషిగా వున్నంతకాలం అతణ్ణి ప్రేమించే వాళ్ళూ ద్వేషించే వాళ్లు మాత్రమే కాకుండా, మధ్యస్తంగా వుండేవాళ్ళు కూడా వుంటారరు. ఒక్కసారి రాతి(పోనీ సిమెంటు) బొమ్మయి పోయాక అతడి చుట్టూ భక్తీ, లేదా ద్వేషం వుంటాయి.

నేత గీత దాటితే…!

గీత గీసెయ్యటం తేలికే. దానికి కాపలా కాయటమే కష్టం.

కోపంతో గీసిన గీత కోపం చల్లారేటంత వరకే వుంటుంది.

నిప్పుతో గీసేదే గీత. నీళ్ళు తెస్తే చెరిపి వేతే.

కోపం రగిలి లక్ష్మణుడు గీత గీస్తే,, కోపం రగిలించటానికి కృష్ణుడు గీత చెప్పాడు.

స్పష్టత తెచ్చేది గీత. తనవారికీ, పగవారికీ తేడా చెప్పేది గీత. ఈ గీత చెరిగి పోతే-చెంగు చాచే వాడెవడో, కొంగు లాగే వాడెవడో సీతకూ తెలియదు; బంధువెవడో, శత్రువెవడో అర్జునుడికీ తెలియదు.

చదవేస్తే ఉన్న ‘నీతి’ పోతుందా?

ఒకడేమో కడుపు కోసేస్తానంటాడు; ఇంకొకడేమో గోతులు తీసేస్తానంటాడు; మరొకడేమో మక్కెలు విరగ్గొడతానంటాడు; అదీఇదీ కాక టోపీపెట్టేస్తానంటాడు ఓ తలకాయలేని వాడు. ఇవన్నీ పిచ్చి ప్రగల్బాలు కావు. కలలు. పిల్లకాయలు కనే కలలు.కలలు కనండీ, కలలు కనండీ… అనీ కలామ్‌ గారు పిలుపు నిచ్చారు కదా- అని, ఇలా మొదలు పెట్టేశారు. పనీ పాట లేక పక్క ఫ్లాట్లలో పిల్లల్ని పోగేసి, కలామ్‌ గారడిగినట్లే, మీరేం కావాలనుకుంటున్నార్రా అని అడిగాను. ఒక్క వెధవ తిన్నగా చెప్పలేదు.

‘హౌస్‌’ కన్నా జైలు పదిలం!

‘ప్రజాస్వామ్యానికి అసెంబ్లీ, సెక్రెటేరియట్‌- ఈ రెండూ అవసరం అంటారా?’

‘అదేమిటి శిష్యా? అంత మాట అనేశావ్‌?’

‘అసెంబ్లీ ఎందుకు చెప్పండి?అరుచుకోవటానికి కాకపోతే..! ఎమ్మెల్యేలు ఆ ఆరుపులేవో టీవీ స్టుడియోల్లో ఆరచుకోవచ్చు కదా?’

‘మరి చట్టాలు ఎక్కడ చేస్తారు శిష్యా?’

చిల్లు జేబు

‘గురూజీ?’
‘వాట్‌ శిష్యా!’

‘రూపాయి పడింది. చూశారా?’
‘ఎక్కడ శిష్యా!?’

‘ఇక్కడే ఎక్కడో పడింది గురూజీ?’
‘అలా ఎలా పడేసుకున్నావ్‌ శిష్యా!?’

‘ఐ డోన్ట్‌ లవ్యూ’ – అను అవిశ్వాస ప్రేమకథ

జైలు గదిలో ఒక రాత్రి ఇద్దరికి నిద్రపట్టటం లేదు. అందులో ఒకడు దొంగా, ఇంకొకడు హంతకుడు.

బయిటున్నప్పుడూ ఇద్దరూ నైట్‌ డ్యూటీలే చేసేవారు.

‘సరదాగా ఒక కల కందామా?’ అన్నాడు దొంగ.

‘నిద్ర పట్టి చస్తే కదా- కలకనటానికి!’ హంతకుడు విసుక్కున్నాడు.

‘కలంటే కల కాదు. ఒక ఊహ.’

‘అది పగటి కల కదా! రాత్రిళ్ళు కనటం కుదరదు’.

హంతకుడంతే. మాట్లాడితే పొడిచినట్లో, ఎత్తి పొడిచినట్లో వుంటుంది.వృత్తికి కట్టుబడ్డ మనిషి.

అంత మాత్రాన దొంగ వదులుతాడా? చిన్న సందు దొరికితే చాలు. దూరిపోడూ..?!