పేరు : అన్నా హజారే
దరఖాస్తు చేయు ఉద్యోగం: మాజీ మహాత్ముడు ( అంతా రాని ‘లోక్పాల్’ మహిమ. లేకుంటే, మాజీ సైనికుడిగానే మిగిలిపోయేవాణ్ణి)
ముద్దు పేర్లు : అన్నా( ముచ్చటొచ్చి ‘అన్నా’నంటారు. నిజంకాదు. నేనేదయినా ‘అన్నా’నా? కేవలం విన్నానంతే-కిరణ్ బేడీ చెప్పిందీ,కేజ్రీవాల్ చెప్పిందీ.), ‘బేజారే'(లక్షల్లో జనాన్ని చూసి ఏడాది తర్వాత వందల్లో చూడాల్సి వస్తే బేజారు గా వుండదూ!)
విద్యార్హతలు : నేనొప్పుకోను.. విద్యే అర్హత అంటే నేనొప్పుకోను. ఏడవతరగతి వరకూ చదువుకున్నాను. మనదేశంలో రాజ్యాంగాన్ని విమర్శించటానికి, మార్చటానికి చదువు అవసరమంటారా?(రాయటానికయితే చదువులు కావాలేమో లెండి.)