ఒక్కడు.. ఒకే ఒక్కడు.. నూటికొక్కడు.. కోటికొక్కడు.
సినిమాలకే కాదు, రాజకీయాలకు కూడా మంచి టైటిల్సే. అలాఅని పోరాడే భగత్‌సింగో, అల్లూరి సీతారామ రాజో కోటి మందిలో ఒక్కడు వుంటాడని కాదు. నడుస్తున్నవి పూర్తిగా ఉద్యమ రాజకీయాలయితే, అలా అనుకో వచ్చు. కానీ కాదు. ఇవి పచ్చి అధికార రాజకీయాలు. ఇక్కడ కోటికి ఒక్కడు అంటే, కోటిలో ఒక్కరికి పీట వేసి, కోటి మందినీ సుఖపెట్టిన కీర్తిని కొట్టెయ్యటం.