తిను, తినిపించు, లైఫ్ అందించు.
ఇదేదో ‘ఎఫ్ ఎమ్’ రేడియో నినాదం కాదు. చక్కటి రాజకీయ నినాదం. రాజకీయాల్లో వున్నవారు ‘తినటం’ సర్వ సాధారణం. అయితే తాను మాత్రమే ‘తిని’ ఊరుకునే నేతకు పేరు రాదు. ‘వంద’లో ‘తొంభయి’ తాను తిని, ఇతరుల చేతిలో ‘పద’న్నా పెట్టే వాడు ‘మారాజు’ అయిపోతాడు. ఇదీ అవినీతిలో కూడా జనం తీయగల నీతి. ఇన్నాళ్ళూ ఈ ‘నీతి’కి మార్కెట్టుందనుకున్నారు.
కానీ కళ్ళ ముందు ‘కర్ణాటకం’ కనిపించింది. ‘తిని’ ఊరుకున్న వారే కారు, ‘తిని, తినిపించి’న వారు కూడా 2013 అసెంబ్లీ ఎన్నికలలో మట్టి కరిచారు.