Tag: ఉత్తరాఖండ్

సీమాంధ్రలో ‘ప్రత్యేక’ ఉద్యమమా?

ఆత్మాహుతి. ఈ మాట తెలుగు నాట రాష్ట్ర విభజనకు ముందు విన్నాం. విడిపోయి ఏడాది దాటాక మళ్ళీ వినాల్సి వస్తోంది. అప్పుడు ఆత్మాహుతులు తెలంగాణలో జరిగాయి. ఇప్పుడు ఆంధ్రలో వినబడింది. విభజనకు ముందు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దీటుగా సమైక్యాంధ్ర ఉద్యమం చెయ్యాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఉద్వేగాలు ఆంధ్రలో కూడా పతాక స్థాయిలో లేచాయి. తెలంగాణలో ఆ ఉద్వేగం ఆత్మహత్యలూ, ఆత్మాహుతుల వరకూ వెళ్ళి పోయింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ దిశగా పయినించలేదు. కానీ రాష్ట్రం విడిపోయి ఏడాది దాటిపోయిన తర్వాత తెలంగాణ ప్రశాంతంగా వుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త ఉద్వేగం మొదలయ్యింది. అదే ‘ప్రత్యేక హోదా’కు చెందిన ఉద్యమం.