జనమంటే ఏ జనం? వచ్చిన జనమా? తెచ్చిన జనమా? ఇది కూడా శేష ప్రశ్నే.
జనం తమంత తాము రావటానికి- గ్లామరో, అభిమానమో, సానుభూతో వుండాలి. ఒక్కొక్క సారి
ఇవేమీ లేకుండా కూడా ‘విచిత్రమైన ఆసక్తి’తో కూడా జనం వస్తుంటారు. ఎన్టీఆర్‌కు ‘వెన్నుపోటు'( కొందరు తిరుగుబాటు అంటారు లెండి) పొడిచి ముఖ్యమంత్రి అయి, తర్వాత పదవీచ్యుతుడయిన నాదెండ్ల భాస్కరరావు కొత్త పార్టీ (ప్రజాస్వామ్య తెలుగుదేశం) పెట్టి ‘రోడ్‌షో’లు నిర్వహిస్తే, ఆయనను చూడటానికి వచ్చారు. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన భార్య లక్ష్మీపార్వతి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా జనం ఆమెను చూడటానికి వచ్చారు. కానీ వీరిద్దరికీ జనం ఘోరపరాజయాన్ని చవిచూపించారు.