రాహుల్ గాంధీ రేంజ్ హఠాత్తుగా మారిపోయిందా? ఆయన రేటింగ్స్ ఠపీ మని పెరిగిపోయాయా? యువరాజుకి పార్టీలో రాజయోగం పట్టేసినట్లేనా? అధ్యక్షుడికి ముందు వున్న ‘ఉప’ విశేషణం తొలిగిపోయినట్లేనా? చూడబోతే, ఇలాంటి వింత ఏదో దేశ రాజకీయాల్లో జరిగేటట్లుగానే వుంది. ఆటలో ఎప్పుడోకానీ గెలవని వాడిని, గెలిపించాలంటే రెండే రెండు మార్గాలు. ఒకటి: ఆట నేర్పించటం రెండు:…
Tag: ఎన్టీఆర్
ఏడ్చినట్టుంది రాజకీయం!
సినిమాలే కాదు, రాజకీయాలు కూడా సెంటిమెంటు మీద ఆడేస్తాయి. తెలుగుప్రేక్షకుడి దృష్టిలో సెంటిమెంటు అంటే మరేమీ కాదు, ఏడుపు. అవును ఉత్త ఏడుపే.
ఎంత చెట్టుకు అంత గాలి లాగా, ఎంత డబ్బుకు అంత ఏడుపు. అదే హైదరాబాద్. ముఫ్పయి రూపాయిల పెట్టి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లో వున్న సినిమాలోనూ ఏడ్వవచ్చు. నూటయాభయి రూపాయిలు పెట్టి మల్లీప్లెక్స్ థియేటర్లోనూ ఏడ్వవచ్చు. కాళ్ళు ముడుచుకుని. ముందుకుర్చీల్లో కూర్చున్న తలల మధ్యనుంచి చూస్తూ ఏడ్వవచ్చు. వెల్లికిలా చేరపడి, కాళ్ళుతన్ని పెట్టి ‘రిక్లయినర్’ ఏడ్పూ ఏడ్వవచ్చు.