వేరే గ్రహం నుంచి భూమ్మీదకు దిగి, వెతుక్కుంటూ, వెతుక్కుంటూ భారత దేశం వచ్చిన ‘పీకే'(అమీర్ ఖాన్), ఈ దేశంలో తప్ప ఎక్కడయినా వుంటానంటున్నాడా? ఆ సినిమాలో అన్ని మత ఛాందసాలకూ, సమానంగా తలంటు పోసిన అమీర్ పట్ల, ఒక మతానికి చెందిన ఛాందసులే ‘అసహనం’ ప్రదర్శించారా? ఇంతకీ దేశం వెళ్ళాలనే ఆలోచన ఆయనకు వచ్చిందా? లేక హిందువుగానే పుట్టిన తన భార్య(కిరణ్)కు వచ్చిందా?