యూటర్న్ అనుకున్నా, ఏ టర్న్ అనుకున్నా, కేంద్రం హైదరాబాద్ హోదా మీద మరో ప్రకటన చేస్తుందన్నది నిజయమ్యే అవకాశం వుంది. ఇందుకు కాంగ్రెస్ ఇప్పటికే వ్యూహ రచన ఖరారు చేసివుండాలి. మనకు రాష్ట్రమంటే ‘రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ‘ ప్రాంతాలు కావచ్చు. కానీ కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ కు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే 42 పార్లమెంటు సీట్లు. యూపీయే-3ను అధికారంలో వుంచటానికీ, రాహుల్ని ప్రధానీ, కాకుంటే యూపీయే చైర్పర్సన్ చెయ్యటానికీ మన రాష్ట్రం నుంచి వెళ్ళే ఎంపీ సీట్లు కూడా అత్యంత కీలకమే.