ఆంధ్రప్రదేశ్లో ఎవరు గ్రహం? ఎవరు ఉపగ్రహం? బీజేపీ, తెలుగుదేశం పార్టీల విషయంలో పరిశీలకులకు కలుగుతున్న సందేహమిది. రెంటి మధ్యా ‘వియ్యమూ’ కొత్త కాదూ, ‘విడాకులూ’ కొత్త కాదు. ఇంతకు ముందు కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసి ‘కాపురం’ చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీరామారావు బీజేపీని పూర్తిగా దూరం పెట్టినా, ఆ తర్వాత పార్టీ పగ్గాలు అందుకున్న చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీతో ‘దాగుడు మూతలు’ ఆడుతూనే వున్నారు. ఆయనకి ఈ పార్టీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది.