
ఒంటి చేతి చప్పట్లూ, ఒంటి శరీరపు కౌగలింతలూ, ఒంటెద్దు నాగళ్ళూ… ఉంటాయా? అని అడగ కూడదు. ఉంటాయి. ఏక సభ్య సంఘంలో చర్చల్లాగా…!
ఉన్నదే ఒకే ఒక సభ్యుడు కదా! ఎలా చర్చిస్తాడూ- అన్న అనుమానం వస్తుంది. తనలో తాను చర్చిస్తాడు. ఏం? తప్పా! ఆ మాటకొస్తే గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ తరహా చర్చలే చేస్తారు. అసలు గొప్ప వారంటేనే ఒంటరి వారు.