నెంబర్ వన్ జగన్, టూ జగన్, త్రీజగన్… టెన్కూడా జగనే. వైయస్సార్ కాంగ్రెస్లో నాయకత్వ పరిస్థితి అది. ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో వైయస్ రాజశేఖర రెడ్డి కూడా అలాగే వున్నారు. వోటర్లను సమ్మోహితుల్ని చెయ్యటానికి పార్టీలో అగ్రతార అలాగే కనిపించాలి. ఇదే ఆకర్షణ. కానీ, పార్టీనిర్మాణానికి ఇది అడ్డంకి అవుతుంది. ప్రతీ పనికీ కార్యకర్తలు అగ్రనేత ఆదేశాల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రతి చిన్న విషయంలోనూ అగ్రనేత తల దూర్చాల్సి వుంటుంది. ఈ పనే ఇప్పుడు జగన్ చేస్తున్నారు. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ జగన్ను అరెస్టు చేసి, జైలు పాలు చేస్తే, ఆయన తర్వాత ఆ పాత్రని ఏ నేతలు పోషిస్తారు? రాజకీయాల్లో సంక్షోభం కూడా అవకాశమే. దీనిని ఉపయోగించుకోవటానికి జగన్ తర్వాత ఎవరు సిద్ధంగా వున్నారు?