పిలుస్తూనే వుంటాం. మనిషి తర్వాత మనిషిని ఈ భూమ్మీదకు ఆహ్వానిస్తూనే వుంటాం. నన్ను నా అమ్మా నాన్నా
ఆహ్వానించినట్లు, నేను నా బిడ్డల్ని ఆహ్వానించాను. ఆహ్వానితుడికి ఎర్రతివాచీ పరచనవసరం లేదు; పట్టు బట్టలు పెట్టనవసరం
లేదు; పంచ భక్ష్య పరమాన్నాలు వడ్డించనవసరంలేదు. ఆకలినో, నేరాన్నో బహూకరించకుండా వుంటే, అదే పది వేలు. వాడి
చేతికి బలపం ఇవ్వక పోయినా ఫర్వాలేదు, నెత్తిన ఇటుకల దొంతర పేర్చకుండా వుంటే చాలు. అన్ని మాటలు ఎందుకు కానీ,
వాడిపై జాలి చూపించకపోయినా ఫర్వాలేదు, భుజానికి జోలె తగిలించకుండా వుంటే చాలు.