పేరు : అరవింద్ కేజ్రీవాల్
దరఖాస్తు చేయు ఉద్యోగం: రెండు నెలల ముఖ్యమంత్రి.( మొదటి సారి ఢిల్లీకి ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు 49 రోజులు చేసి రాజీనామా చేశాను. ఈ సారి 60 రోజులు చేసి రాజీనామా చెయ్యాలన్నది నా కోరిక.)
ముద్దు పేర్లు :”గురివింద్’ కేజ్రీవాల్ (గురివిందకి అంతా ఎరుపే. ఎక్కడో కొంచెం నలుపు. అందుకే కోబోలు వచ్చిన ఢిల్లీ పీఠాన్ని వదలు కొన్నాను.’కాశీ’ వెళ్ళి ఓటమిని తెచ్చుకున్నాను.) ‘శోక్’ పాల్. ( లోక్ పాల్ బిల్లు రానంతవరకూ ‘లోక్ పాల్ … లోక్ పాల్’ అంటాను. తీరా వచ్చాక, అది ‘జన లోక్ పాల్’ కాదే..! అని శోకిస్తాను.)