భార్యకి విడాకులు ఇచ్చేసి వెళ్ళుతూ, ‘నేను కట్టిన మంగళ సూత్రం జాగ్రత్త’ అన్నాడు బాధ్యత గల భర్త ఒకడు. ‘ఆ మాట నాకెందుకు చెబుతారూ, నేను చేసుకోబోయే రెండో భర్తకు చెప్పండి. నేను ఎంత చెప్పినా వినటం లేదు. కొత్త మంగళసూత్రం కొంటానంటున్నాడు. నేనేమో, మీరు కట్టింది వుంది కదా- అని చెబుతున్నాను.’ అని ఆమె అనగానే ఆ మాజీ భర్త ఎంతో ముచ్చట పడ్డాడు. ‘అవును. మళ్ళీ అదనపు ఖర్చు ఎందుకూ? అన్నట్టు. మనకి పెళ్ళికి నువ్వు కట్టుకున్న చీర కోసం వెతుక్కుంటావేమో! నేను తీసుకువెళ్తున్నాను. నా రెండో పెళ్ళికి పనికి వస్తుందని.’ అని ముక్తాయించాడు కూడా.
Tag: దాడి వీరభద్రరావు
ఎదురు ‘దాడి’
పేరు : దాడి వీరభద్రరావు
ముద్దు పేరు : ‘గాడి'( బాబును నమ్మి ఒక గాడిలో ‘సైకిలు’తొక్కాను. ఏముంటుంది. ఎదుగూ లేదు. బొదుగూ లేదు.) ‘దాడి'( బాబును నమ్ముకుని కాంగ్రెస్నూ, వైయస్సార్ కాంగ్రెస్నూ అనరాని మాటలన్నాను. ఇప్పుడు వాటిల్లో ఏదో ఒకటి ద్కియ్యేట్టుంది.) ‘ఎదురు దాడి’ (ఇన్నాళ్ళకు తెలివి వచ్చి బాబు మీదకు దాడికి సిధ్ధపడ్డాను. అది కూడా శాసన మండలి పదవీ కాలాన్ని చిట్ట చివరి రోజు కూడా అనుభవించాక.)