దేశం గుర్తుకొచ్చింది.కాస్సేపు ప్రాంతం,కులం, వర్గం, మతం పోయి భారతీయులకు దేశం గుర్తుకొచ్చింది. అందుకు కారకుడు సరబ్జిత్.
ఇరవయి మూడేళ్ళు పాక్ జైలులో మగ్గి,విడుదలకు అన్ని అర్హతలూ వుండి చిత్రహింసలకు గురయి, కోమాలోకి వెళ్ళి కడకు మరణించాడు. పాకిస్తాన్ ఎంత బుకాయించినా, ఇది ఆ ప్రభుత్వం చేసిన ‘దారుణ హత్య’. సాధారణంగా చేసే హత్య ‘ఎన్కౌంటర్’ పేరు మీదనో, ‘లాకప్‌డెత్’ పేరు మీదనో జరుగుతుంది. ఇది మూడో రకం. ఈ హత్యను ‘అధికారులు’ చెయ్యలేదు. సాటి ఖైదీలు చేశారు. కాకుంటే వారు ‘పాక్’ ఖైదీలు.