ద్వేషాన్ని మించిన ప్రేలుడు పదార్థం రాజకీయాల్లో లేదు. మరీ మత ద్వేషం అయితే ‘ఆర్డీఎక్స్’ కన్నా ప్రమాద కరం.
ఒక్క ద్వేషంతో సర్కారును పేల్చిపారేయవచ్చు. ప్రేమతో ఒక్కటి కాని మనుషుల్ని పగతో ముడివేయ వచ్చు. దేశంలో నగల షాపులున్నట్లే ఎక్కడికక్కడ పగల షాపులున్నాయి. ఇక్కడ సరసమైన ధరల్లో రకరకాల ద్వేషాలు అమ్మేస్తుంటారు: ప్రాంతీయ విద్వేషం. కులద్వేషం, లింగ ద్వేషం, భాషా ద్వేషం, మత ద్వేషం. అయితే అన్నింటి ధరలు ఒకటి కావు. అన్నింటికన్నా చౌకగా వుండీ, అందరికీ అందుబాటులో వుండే ద్వేషం- మత ద్వేషం.