
ఒక ఐడియా కాదు,
చిన్న పొగడ్త మీ జీవితాన్నే ఆర్పేస్తుంది.
ఓ సగటు పిల్ల- పెద్ద అందగత్తె కాదు, పెద్ద చదువరీకాదు- పడి పోయింది. ప్రేమలో కాదు. పొగడ్తలో.
ఆమె అసలే. ‘టిప్పు’లాడి. నలభయి రూపాయిల కాఫీ తాగి, అరవయి రూపాయిలు ‘టిప్పి’స్తుంది. కారణం ఎవరో చూస్తారని కాదు. ‘మీరు దేవత మేడమ్’ అన్న ఒక్క మాట కోసం.
ఇది చూసిన ఓ ‘మనీ’హరుడు (అసలు పేరు మనోహరుడు లెండి) ఆమెను సులభవాయిదాల్లో పొగడుదామని నిర్ణయించేసుకున్నాడు. ఏముంది? మూడు రోజలు వెంటపడ్డాడు.