Tag: నరేంద్రమోడీ

వ్యూహం లేని గ్లామర్‌.. వాసన రాని పువ్వు!

ఒకప్పుడు గ్లామరే రాజకీయం. నేడు వ్యూహమే సర్వస్వమయిపోయింది. కేవలం వ్యూహమే వుండి, జనాకర్షణ లేకపోయినా దిగులు లేదు. తర్వాత అదే జనాకర్షణగా మారుతుంది. ఉత్త జనాకర్షణ వుండి వ్యూహం లేక పోతే.. ఆ మెరుపు ఎన్నాళ్ళో నిలవదు. జాతీయ రాజకీయాల్లో రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోడీల విషయంలో అదే జరిగింది. రాహుల్‌ గాంధీకి జనాకర్షణ అన్నది…

బాబు ‘గ్రహ’ స్థితి మారిందా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గ్రహం? ఎవరు ఉపగ్రహం? బీజేపీ, తెలుగుదేశం పార్టీల విషయంలో పరిశీలకులకు కలుగుతున్న సందేహమిది. రెంటి మధ్యా ‘వియ్యమూ’ కొత్త కాదూ, ‘విడాకులూ’ కొత్త కాదు. ఇంతకు ముందు కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసి ‘కాపురం’ చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీరామారావు బీజేపీని పూర్తిగా దూరం పెట్టినా, ఆ తర్వాత పార్టీ పగ్గాలు అందుకున్న చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీతో ‘దాగుడు మూతలు’ ఆడుతూనే వున్నారు. ఆయనకి ఈ పార్టీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది.

సంకీర్ణాన్ని మోడీ తుడిచేస్తారా?

రాజ్యం తర్వాత రాజ్యాన్ని కైవసం చేసుకుంటూ వెళ్ళే దండయాత్రలాగా, నరేంద్రమోడీ-అమిత్‌ షాలు రాష్ట్రాన్ని తర్వాత రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ వెళ్తున్నారు. మహారాష్ట్ర, హర్యానాలు ముగిసాయి; ఇప్పుడు జమ్మూ-కాశ్మీర్‌, జార్ఖండ్‌లు, వెను వెంటనే ఢిల్లీ. మహరాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 22 సీట్లు తక్కువ వచ్చినా, హర్యానాలో సంపూర్ణమైన మెజారిటీయే వీరి నేతృత్వంలో బీజేపీ సాధించింది. రెండు చోట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత నుంచీ ‘మోడీ-షా’లు రాజకీయంగా ఒక సందేశాన్ని దేశమంతటా పంపిస్తున్నారు: ‘సంకీర్ణయుగం ముగిసింది’. ఈ సందేశాన్ని ముందు వారు ‘మనోవాక్కాయ కర్మణా’ నమ్మాలి.

‘నెలవంక’య్య నాయుడు

పేరు : ఎం.వెంకయ్య నాయుడు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సీమాంధ్ర చాంపియన్‌-4’ ( మొదటి మూడు స్థానాలు నిండిపోయాయి. జగన్‌, కిరణ్‌, బాబులు వాటిని సాధించారు. అయినా సరే, ప్రయత్నిస్తే ఎప్పుడోకప్పుడు మొదటి స్థానానికి చేరక పోతామా- అన్నది పట్టుదల)

ముద్దు పేర్లు : ‘నెల వంక’య్య నాయుడు.( అవును. నెలవంక అంటే ‘చంద్రుడే’. తెలుగు ‘చంద్రుడే’. బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడెల్లా, చంద్రాబునాయుడుతో మాట్లాడటానికి, వెంకయ్య నాయుడు- అను నాతో పని వుంటుంది కదా)

‘లౌకిక్‌’ కుమార్‌!

పేరు : నితిష్‌ కుమార్‌

ముద్దు పేరు : ‘లౌకిక్‌’ కుమార్‌(పదిహేడేళ్ళ సుదీర్ఘనిద్ర తర్వాత మేల్కొని, నేనున్నది మతవాద పార్టీ అని గ్రహించి బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాను. మార్క్స్‌ చెప్పింది నిజమే సుమండీ.. ‘మతం మత్తు మందే.’), ‘అద్వానీష్‌’ కుమార్‌(గుజరాత్‌ అల్లర్లు దారుణమా? బాబ్రీ విధ్వంసం దారుణమా? అని ఎవరయినా నన్నడిగితే ‘రెండూ దారుణమే’ అంటాను. కానీ ‘గుజరాత్‌ అల్లర్లు ‘కాస్త ఎక్కువ దారుణం’ అని అంటాను. అందుకే ‘తక్కువ దారుణానికి’ కారకుడయిన అద్వానీ వైపే వుంటాను.)

‘రథ్వా’నీ – ‘యుధ్ధ్వా’నీ- ‘వృధ్ధ్వా’నీ!!

పేరు : లాల్‌ కృష్ణ అద్వానీ

ముద్దు పేరు : ”రథ్వా’నీ(మందిర నిర్మాణం కోసం రథ యాత్ర చేసినప్పుడు),

‘యుధ్వా’నీ( కార్గిల్‌ వద్ద పాకిస్థాన్‌తో యుధ్ధం చేసినప్పుడు) ‘వృధ్ధ్వా’నీ( ఎనభయ్యదేళ్ళ

వయస్సులో నేను ప్రధాని పదవి అర్హుణ్ణి కానని, నరేంద్ర మోడీని ముందుకు తెస్తున్నప్పుడు).

అయినా కానీ ఎప్పటికయినా నేను ‘ప్రధ్వా’నీనే( ప్రధాని కావాలన్న కోరికను నానుంచి ఎవరూ

దూరం చేయలేరు.)