పేరు :మణి శంకర్ అయ్యర్ దరఖాస్తు చేయు ఉద్యోగం: కేంద్ర వివాదాస్పద వ్యాఖ్యల శాఖా మాత్యులు. (బీజేపీ ఎలాగూ ఇవ్వదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, ఇలాంటి శాఖను ఏర్పాటు చెయ్యటానికి వెనకాడదు కానీ, ఆ పదవి నాకివ్వటానికి ఇష్టపడదు. ఇంకేదన్నా సర్కారు వస్తే ఇస్తుందేమో చూడాలి.) వయసు : ఏం? ఎందుకా సందేహం? వయసుకు తగ్గట్లు…
Tag: నరేంద్ర మోడీ
‘గో’మిత్ షా!
పేరు : అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా (చిన్నబుచ్చితే) అమిత్ షా
దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘కవ్’ బాయ్ ( ఏం? సినిమాల్లోనే గానే రాజకీయాల్లో ‘కవ్ బాయ్స్’ వుండకూడదా? ‘గోవు’ పవిత్రమైన జంతువు అని కుర్రాళ్ళంతా ‘కవ్ బాయ్స్’ కారా?
వయసు : మేం బీజేపీలో ‘బాయ్స్’ మే. నేను యాభయిలలో వున్నా, మోడీ అరవయిలలో వున్నా మేం ‘బాలురం’ కిందే లెక్కే, ఎందుకంటే, అద్వానీజీ, మురళీ మనోహర్ జోషీజీలు ఎనభయిలల్లో వుంటూ ‘యవ్వనుల్లా’గా కుర్చీలకు పోటీ పడుతున్నారు కదా!
ముద్దు పేర్లు :’గో’మిత్ షా( గోవు అంటే ఆవు. మిత్ అంటే కల్పన. రెండూ చేసింది నేనే. బీహార్ ప్రజలు గోవును పవిత్రంగానే స్వీకరించారు. బీజేపీ అంటే గోవు, గోవు అంటే బీజేపీ అని నమ్మారు. తదనుగుణంగానే మాకు తీర్పు ఇచ్చారు. 243 సీట్లకీ 58 సీట్లే ఇచ్చారు. ‘గంగి గోవు పాలు గరిటడయినను చాలు’ అంటారు. )
‘గురివింద్’ కేజ్రీవాల్!
పేరు : అరవింద్ కేజ్రీవాల్
దరఖాస్తు చేయు ఉద్యోగం: రెండు నెలల ముఖ్యమంత్రి.( మొదటి సారి ఢిల్లీకి ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు 49 రోజులు చేసి రాజీనామా చేశాను. ఈ సారి 60 రోజులు చేసి రాజీనామా చెయ్యాలన్నది నా కోరిక.)
ముద్దు పేర్లు :”గురివింద్’ కేజ్రీవాల్ (గురివిందకి అంతా ఎరుపే. ఎక్కడో కొంచెం నలుపు. అందుకే కోబోలు వచ్చిన ఢిల్లీ పీఠాన్ని వదలు కొన్నాను.’కాశీ’ వెళ్ళి ఓటమిని తెచ్చుకున్నాను.) ‘శోక్’ పాల్. ( లోక్ పాల్ బిల్లు రానంతవరకూ ‘లోక్ పాల్ … లోక్ పాల్’ అంటాను. తీరా వచ్చాక, అది ‘జన లోక్ పాల్’ కాదే..! అని శోకిస్తాను.)
కేలెండరే కాదు, కేరక్టర్లూ మారాయి!
అంతా ముందే. తర్వాత ఏమీ వుండదు. పెళ్ళికి ముందే, బాజాలయినా, భజంతీలయినా. పెళ్ళయ్యాక ఏమి మిగులుతాయి? ఎంగిలి విస్తళ్ళు తప్ప. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కూడా పెళ్ళిళ్ళు లాంటివే. ఎన్నికలకు ముందే హడావిడి. అయ్యాక ఏమీ వుండదు.
కేలండర్ దాటితే( 2013 పోయి 2014 వస్తే) రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలే. అప్పుడు ఏమి మిగులుతాయి? వెలిసిపోయిన పోస్టర్లూ, హోర్డింగులూ మినహా. హడావిడి అంతా, ఎన్నికలకు ముందు సంవత్సరమే. అందుకే 2013 అంతా చప్పుడుతో గడిచింది.
‘ఖద్దరు’ సేన కిది రాహుల్ నామ సంవత్సరమయితే, ‘కాషాయ’ దళానికి మోడీ నామ సంవత్సరం. ప్రధాని అభ్యర్థులు ఖరారయ్యారు. రాహుల్‌కు కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎవ్వరూ లేరు.(ఉన్నా రారు కూడా.) కానీ, బీజేపీలో మాత్రం మోడీకి పోటీ వచ్చారు. సాక్షాత్తూ, గురువూ, కురువృధ్ధుడూ అద్వానీయే పోటీకి వచ్చారు
నాది ‘సేమ్ డైలాగ్’ కాదు!
రాహుల్ మోడీ!
నరేంద్ర గాంధీ!
అనుమానం లేదు. మీరు సరిగానే చదివారు. ఇద్దరూ ప్రధాన అభ్యర్థులే. కానీ రూపాలు మారలేదు. కానీ గొంతులే మారాయి.
రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీ, నరేంద్రమోడీకి రాహుల్ గాంధీ వచ్చి డబ్బింగ్ చెప్పినట్లుంది. ఒకరి మాటలు ఒకరు మాట్లాడేస్తున్నారు. వారి సభలకు వచ్చిన వారూ, వాటిని టీవీల ముందు కూర్చుని వింటున్న వారూ, కాస్సేపు తమని తాము గిల్లి చూసుకుంటున్నారు.
కలయా?నిజమా? వైష్ణవ మాయా?
అఫ్ కోర్స్. కలయే. ఎన్ని ‘కల’యే.
‘దేశ‘మును ప్రేమించుమన్నా.. పొత్తు అన్నది ఉంచుమన్నా.!
మోడీ బాడీ ‘సిక్స్ ప్యాక్’ కాదా..?
మతిమరపు ఒకటే. నమూనాలు వేరు.
చాలా కాలం క్రితం పత్రికలో ఓ కార్టూన్ అచ్చయింది- మతిమరపు మీదే. గురు శిష్యులు క్లాస్‌కు వస్తుంటారు. గురువుగారికి చొక్కా వుండదు. ఆయన వెనకాలే నడుస్తున్న శిష్యుడికి ఫ్యాంటు వుండదు. అలాగని గురువుని మించిన శిష్యుడు-అని నిర్ధారణకు వచ్చేయనవసరం లేదు. ఇద్దరు మరచిపోయింది దుస్తులే కావచ్చు. శరీరాన్ని ఒకరు పైభాగం కప్పటం మరచిపోతే, ఇంకొకరు కింద భాగాన్ని మరచిపోయారు.
వృద్ధిలోకూడా ఎవరి నమూనా వారికి వుంటుంది.
‘గుజ’ బలుడు మోడీ
ఓడలు బళ్ళవుతాయి: అద్వానీలు మోడీలవుతారు.
బళ్ళు ఓడలవుతాయి: మోడీలు అద్వానీలవుతారు.
అలనాడు అద్వానీకి అనుంగు శిష్యుడు మోడీ. కానీ ఇప్పుడు, అదే అద్వానీ ‘న.మో’ అంటున్నారు.
రేపో, మాపో, అద్వానీ తాను వెనక్కి తగ్గి పోయి- ప్రధానివి నువ్వే- అని మోడీతోఅన్నా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే పోటీలో వున్న వాళ్ళంతా ఇలాంటి ఆశీస్సులే ఇచ్చేస్తున్నారు.