బెంగ.
2012 లాగే 2014 కూడా ఉంటుందన్న బెంగ.
ఉప ఎన్నికల ఫలితాలే, సార్వత్రిక ఎన్నికల్లోనూ వస్తాయన్న బెంగ.
రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీకి బదులు మూడు ప్రాంతీయ పార్టీలు(తెలుగు దేశంతో పాటు, టీఆర్‌ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు) వచ్చేశాయన్న బెంగ.
2014 లో సీమాంధ్రలో త్రిముఖ పోటీ, తెలంగాణాలో చతుర్ముఖ పోటీ వుంటుందన్న బెంగ( బీజేపీ చతికిలపడింది. లేకుంటే పంచముఖ పోటీ వుండేది.)
అన్నింటినీ మించి రాష్ట్రంలో ‘త్రిశంకు సభ’ (హంగ్ అసెంబ్లీ) వస్తుందన్న బెంగ.