Tag: నేషనల్ హెరాల్డ్ వివాదం

బీజేపీ-కాంగ్రెస్‌ల సమర్పణ: ‘స్వామి..రారా!’

స్వామి తలచుకుంటే కేసులకు కరువా? ‘కలహభోజనుడు’ సుబ్రహ్మణ్య స్వామి అంటేనే వివాదం. ఆయన ఏ పార్టీలో వున్నా ‘వన్‌ మ్యాన్‌ ఆర్మీ’ (ఏక సభ్య సైన్యం) లాగా వుంటారు. కూపీలూ లాగటంలోనూ, లొసుగులు వెతకటంలోనూ దిట్ట. అయితే అన్ని కూపీలూ నిలబడవు. కొన్ని వీగిపోతుంటాయి. ఆయన ఎవరి మీదయినా గురిపెట్టారంటే, ఇక వారి చుట్టూనే తిరుగుతుంటారు. రాజకీయంగా ఆయనకు కాంగ్రెస్‌ మీద ఎప్పుడూ ఒక కన్ను వేసే వుంచుతారు. ఈ మధ్య కాలంలో ఆయన కారణంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ రెండు సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు.

‘జగడాల’ స్వామి

పేరు : సుబ్రహ్మణ్య స్వామి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఇన్వెస్టిగేటివ్‌ పాలిటిష్యన్‌ (పరిశోధనాత్మక రాజకీయ నాయకుడు). ( ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు వున్నట్లే, ఇన్వెస్టిగేటివ్‌ పాలిటిష్యన్‌ కూడా వుంటారని మన దేశానికి పరిచయం చేసింది నేనే. నేను తవ్వి తీసిన కేసులు ఎందరో నాయకుల పీకలకు చుట్టుకున్నాయి. జయలలిత నుంచి రాజా వరకూ ఎవ్వరినీ వదల్లేదు)